Share News

పిల్లులకు తిండి పెట్టి రూ. 20 లక్షలు సంపాదించాడు..

ABN , Publish Date - Mar 04 , 2026 | 09:37 AM

ఓ యువకుడు పిల్లులకు తిండి పెట్టి ఏకంగా 20 లక్షల రూపాయలు సంపాదించాడు. అది కూడా కేవలం 20 రోజుల్లోనే ఇంత మొత్తాన్ని సంపాదించాడు. ఈ సంఘటన చైనాలో చోటుచేసుకుంది.

పిల్లులకు తిండి పెట్టి రూ. 20 లక్షలు సంపాదించాడు..
cat feeding services China

ఇంటర్‌నెట్ డెస్క్: చైనాకు చెందిన ఓ యువకుడు పిల్లులకు తిండి పెట్టి ఏకంగా 20 లక్షల రూపాయలు సంపాదించాడు. అది కూడా కేవలం 20 రోజుల్లోనే ఇంత మొత్తాన్ని సంపాదించాడు. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ తెలిపిన వివరాల మేరకు.. షాంఘైకి చెందిన హ్యువాన్ కాంగ్ అనే యువకుడు గత తొమ్మిదేళ్ల నుంచి పెంపుడు జంతువుల సంరక్షణా రంగంలో ఉంటున్నాడు. ఇంటింటికి వెళ్లి పెంపుడు పిల్లులకు ఆహారం తినిపించటంలో స్పెషలైజేషన్ చేశాడు. పెంపుడు జంతువుల యజమానులు ఇంట్లో లేనప్పుడు వాటి ఆలనా పాలనా చూసుకుంటూ ఉంటాడు.


చైనీస్ న్యూ ఇయర్ సందర్భంగా హ్యువాన్ టీమ్‌కు 2000 వేల ఆర్డర్లు వచ్చాయి. అవి కూడా పిల్లులకు తిండి పెట్టే పని వచ్చింది. హ్యువాన్ ఏకంగా 1000 దాకా ఇళ్లకు వెళ్లాడు. అక్కడి పిల్లులకు తిండి పెట్టాడు. పండుగ సందర్భంగా సొంత ఊరికి వచ్చిన 80 శాతం మంది తమ పిల్లులకు తిండి పెట్టడానికి హ్యువాన్ టీమ్‌ను పిలిపించుకున్నారు. 10 శాతం మంది వేరే ఊర్లలో ఉండటం వల్ల.. ఇంట్లోని పిల్లులకు తిండి పెట్టడానికి హ్యువాన్ టీమ్ సాయం తీసుకున్నారు. మిగిలిన 10 శాతం మంది రెగ్యులర్‌గా హ్యువాన్ సర్వీస్ పొందుతున్నారు.


హ్యువాన్ ప్రతీ ఉదయం 3 గంటలకే పని మొదలుపెట్టేవాడు. పని ముగిసే సమయానికి రాత్రి 11 గంటలు అయ్యేది. కేవలం మూడు, నాలుగు గంటలు మాత్రమే పడుకునేవాడు. ప్రతీ రోజూ 55 ఆర్డర్‌లు పూర్తి చేసేవాడు. ఆర్డర్ వచ్చిన ఇంటికి వెళ్లగానే.. మొదట పిల్లులకు తిండే పెట్టే డబ్బాను క్లీన్ చేసే వాడు. దానిలో ఫుడ్‌తో పాటు నీటిని పోసే వాడు. తర్వాత పిల్లుల ఆరోగ్యాన్ని చెక్ చేసేవాడు. తర్వాత కిటికీలు, ఇంట్లోని ఎలక్ట్రికల్ వస్తువులను చెక్ చేసేవాడు. ఇంట్లోని చెత్తను బయటపడేసేవాడు. ప్రతీ ఇంట్లో కేవలం 15 నిమిషాలు మాత్రమే ఉండేవాడు. అలా 20 రోజుల కాలంలో పిల్లులకు తిండి పెట్టడం ద్వారా హ్యువాన్ 20 లక్షల రూపాయలు సంపాదించాడు.


ఇవి కూడా చదవండి

జన గణనకు వెళాయే..

రైతును నిండా ముంచిన టమాట

Updated Date - Mar 04 , 2026 | 10:14 AM