మధ్యాహ్నం లోపే..!
ABN , Publish Date - Sep 25 , 2026 | 06:52 AM
ఖైరతాబాద్ బడా గణపతి నిమజ్జన కార్యక్రమాలు చకచకా అవుతున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం లోపు నిమజ్జనం పూర్తి చేసేందుకు ఇటు ఉత్సవ కమిటీ, అటు పోలీసులు పనుల్లో వేగం పెంచారు.
చక చకా బడా గణేష్ నిమజ్జన పనులు..
హైదరాబాద్: ఖైరతాబాద్ బడా గణపతి నిమజ్జన కార్యక్రమాలు చకచకా అవుతున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం లోపు నిమజ్జనం పూర్తి చేసేందుకు ఇటు ఉత్సవ కమిటీ, అటు పోలీసులు పనుల్లో వేగం పెంచారు. గణపతి కోసం వేసిన షెడ్డు పైనున్న రేకులను గురువారం తెల్లవారుజాము నుండే తీసివేశారు. రాత్రి 12.00 గంటల అనంతరం కళాశాల పూజ చేసి దాన్ని కదిలించిన అనంతరం చివరి పూజలు చేసి గణపతిని పెద్ద ట్రాలీ పైకి చేర్చారు. విగ్రహం కదలకుండా స్టీలు స్తంభాలతో వెల్డింగ్ పనులు పూర్తి చేసి ఉదయం 6 నుంచి 6.30 మధ్యన శోభాయాత్ర ప్రారంభిస్తామని ఉత్సవ కమిటీ ప్రతినిధులు తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో మధ్యాహ్నం 1 నుండి 1.30 లోపల నిమజ్జనం చేస్తామని చెప్పారు.
523 మంది పోలీసులతో..
ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనానికి ఖాకీలు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు పూర్తి చేశారు. పంజాగుట్ట ఏసీపీ మురళీకృష్ణ పర్యవేక్షణలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. మొత్తం 523 మంది అదనపు బలగాలను రంగంలోకి దించుతున్నారు. వీరికి తోడుగా మహిళా భద్రత కోసం షీటీమ్స్, పుషింగ్ పార్టీలు, స్ట్రైకింగ్ ఫోర్స్‌లను ఏర్పాటు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Read Latest AP News And Telangana News And International News And Telugu News