Share News

పట్టణ స్థానిక సంస్థలకు గ్రేడ్‌-2 కమిషనర్లు

ABN , Publish Date - Sep 25 , 2026 | 06:24 AM

రాష్ట్రంలో మున్సిపల్‌ కమిషనర్‌ గ్రేడ్‌-2 అధికారుల తుది కేటాయింపును ప్రభుత్వం ఖరారు చేసింది. మల్టీజోన్‌-1 పరిధిలో 14 మందిని, మల్టీజోన్‌-2కు 23 మందిని కేటాయిస్తూ మున్సిపల్‌, పట్టణాభివృద్ధి శాఖ గురువారం వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేసింది.

పట్టణ స్థానిక సంస్థలకు గ్రేడ్‌-2 కమిషనర్లు

  • మల్టీజోన్‌-1లో 14 మంది, మల్టీజోన్‌-2లో 23 మంది

  • ఉత్తర్వులు జారీ చేసిన మున్సిపల్‌, పట్టణాభివృద్ధి శాఖ

అమరావతి, సెప్టెంబరు 24(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మున్సిపల్‌ కమిషనర్‌ గ్రేడ్‌-2 అధికారుల తుది కేటాయింపును ప్రభుత్వం ఖరారు చేసింది. మల్టీజోన్‌-1 పరిధిలో 14 మందిని, మల్టీజోన్‌-2కు 23 మందిని కేటాయిస్తూ మున్సిపల్‌, పట్టణాభివృద్ధి శాఖ గురువారం వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రపతి ఉత్తర్వులు-2025, స్థానిక కేడర్లకు ఉద్యోగుల కేటాయింపునకు సంబంధించి జారీ చేసిన మార్గదర్శకాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్‌ కమిషనర్‌ గ్రేడ్‌-2 అధికారుల నుంచి ఆప్షన్లు స్వీకరించారు. అనంతరం రాష్ట్రస్థాయి అమలు కమిటీ సమర్పించిన తుది జాబితాను ప్రభుత్వం ఆమోదించింది. రానున్న మున్సిపల్‌ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ కేటాయింపు ఉత్తర్వులు ఎన్నికలు పూర్తయిన తర్వాత అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. ఎన్నికల ముందస్తు సన్నాహకాల్లో అధికారులు నిమగ్నమై ఉండటంతో తదుపరి చర్యలను ఎన్నికల అనంతరం చేపట్టనున్నారు. కేటాయింపుల ఉత్తర్వులను అమలు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని మున్సిపల్‌ శాఖ కమిషనర్‌ అండ్‌ డైరెక్టర్‌ను ప్రభుత్వం ఆదేశించింది.

ఈ వార్తలనూ చదవండి...

మహిళల భద్రతకు ప్రాధాన్యం

బజార్‌లో పోస్టుల అమ్మకం

Updated Date - Sep 25 , 2026 | 06:24 AM