Share News

86 పట్టణ స్థానిక సంస్థల్లో ప్రత్యేకాధికారుల పదవీకాలం పొడిగింపు

ABN , Publish Date - Sep 25 , 2026 | 06:27 AM

రాష్ట్రంలోని 86 పట్టణ స్థానిక సంస్థల్లో ప్రత్యేకాధికారుల పదవీకాలాన్ని ప్రభుత్వం మరో ఆర్నెల్లు పొడిగించింది. ఇందులో 11 మున్సిపల్‌ కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలు/ నగర పంచాయతీలున్నాయి.

86 పట్టణ స్థానిక సంస్థల్లో ప్రత్యేకాధికారుల పదవీకాలం పొడిగింపు

  • మున్సిపల్‌, పట్టణాభివృద్ధిశాఖ ఉత్తర్వులు

అమరావతి, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని 86 పట్టణ స్థానిక సంస్థల్లో ప్రత్యేకాధికారుల పదవీకాలాన్ని ప్రభుత్వం మరో ఆర్నెల్లు పొడిగించింది. ఇందులో 11 మున్సిపల్‌ కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలు/ నగర పంచాయతీలున్నాయి. ఈ పొడిగింపు సెప్టెంబరు 18 నుంచి ఆర్నెల్ల పాటు లేదా ఎన్నికైన పాలకవర్గం బాధ్యతలు చేపట్టే వరకు ఏది ముందైతే అప్పటి వరకూ కొనసాగనుంది. ఈ మేరకు మున్సిపల్‌, పట్టణాభివృద్ధిశాఖ గురువారం ఉత్తర్వులు జారీచేసింది. ప్రత్యేకాధికారుల పదవీకాలం పొడిగించిన 11 కార్పొరేషన్లలో విశాఖపట్నం, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, ఒంగోలు, తిరుపతి, చిత్తూరు, అనంతపురం, కడప, కర్నూలు, విజయనగరం ఉన్నాయి. ఆయా కార్పొరేషన్లకు సంబంధిత జిల్లా కలెక్టర్లు ప్రత్యేకాధికారులుగా కొనసాగనున్నారు. నరసాపురం మున్సిపాలిటీకి ఇప్పటివరకు ప్రత్యేకాధికారిగా ఉన్న భీమవరం జాయింట్‌ కలెక్టర్‌ స్థానంలో నరసాపురం రెవెన్యూ డివిజనల్‌ అధికారిని నియమించారు.

ఈ వార్తలనూ చదవండి...

మహిళల భద్రతకు ప్రాధాన్యం

బజార్‌లో పోస్టుల అమ్మకం

Updated Date - Sep 25 , 2026 | 06:27 AM