Share News

పర్యావరణ సమతుల్యతలో పాముల పాత్ర కీలకం

ABN , Publish Date - Jul 16 , 2026 | 01:29 PM

పర్యావరణ సమతుల్యతలో పాముల పాత్రం ఎంతో కీలకంగా మారింది. ప్రతి సంవత్సరం జూలై 16వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచ పాముల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు.

పర్యావరణ సమతుల్యతలో పాముల పాత్ర కీలకం
World Snake Day

  • నేడు ప్రపంచ పాముల దినోత్సవం

వేములవాడ(రాజన్న సిరిసిల్ల): పర్యావరణ సమతుల్యతలో పాముల పాత్రం ఎంతో కీలకంగా మారింది. ప్రతి సంవత్సరం జూలై 16వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచ పాముల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు. పాముల గురించి ఉన్న అపోహలను తొలగించి, వారి పరిరక్షణ, ఆవశ్యకతను తెలియజేయడమే ముఖ్య ఉద్దేశ్యంగా ప్రపంచ పాముల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.


ఎందుకు జరుపుకుంటారు..

పాములు రైతులకు స్నేహితుల వంటివి. ఒక పాము సంవత్సరానికి రైతులు పండించే పంటపొలాల్లో సుమారుగా 200 ఎలుకలను తింటుందని నిపుణులు చెబుతున్నారు. దీంతో రైతన్నకు పంట నష్టాన్ని పాములు 30 శాతం తగ్గించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పాము లను చంపితే ఎలుకల బెడద పెరిగి ఆహార భద్రతకే ప్రమాదం వాటిల్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా పాము విషముతో క్యాన్సర్‌, గుండె జబ్బు లకు మందులు కూడా తయారుచేస్తున్నారు. కాగా, ప్రతి సంవత్సరం 50వేల మందికి పైగా పాము కాటుకు గురై చనిపోతున్నట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. భయంతో ప్రజలు పాములను చంపేయడం వల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోందని నిపుణు లు అభిప్రాయపడుతున్నారు.


vmd1.2.jpgనేడు ప్రత్యేక కార్యక్రమాలు..

ప్రపంచ పాముల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫారెస్ట్‌ డిపార్ట్‌మెంట్‌, హైదరాబాద్‌ స్నేక్‌ కన్జర్వేషన్‌ సొసైటీ ఆధ్వర్యంలో పలు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఉచిత అవగాహన శిబిరాలు, స్కూల్స్‌లో పిల్లలకు పాముల గురించి క్లాసులు తీసుకోవడం, రెస్క్యూ టీమ్‌ అలర్ట్‌ హెల్ప్‌లైన్‌ నంబర్‌ ద్వారా యాక్టివ్‌గా ఉండటం, ఇంట్లో పాము కనిపిస్తే వెంటనే కాల్‌ చేయాలని, పాము కనిపిస్తే కొట్టకుండా, నిపుణులకు ఫోన్‌ చేయాలనే విధంగా అవగాహన కల్పిస్తామని, పాము కాటు వేస్తే ఇంట్లో కట్టుకట్టడం, కోత పెట్టడం చేయవద్దని, వెంటనే దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లాలని ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో యాంటీవెనమ్‌ అందబాటులో ఉంటుందని వేములవాడ ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ ఖలీలోద్దీన్‌ తెలిపారు.


vmd1.3.jpgభారత్‌లో 270 రకాల పాములు..

భారతదేశంలో 270 రకాల పాములు ఉన్నాయని, అందులో కేవలం 4 రకాల పాములు మాత్రమే ప్రాణాంతకం అని ఫారెస్ట్‌ అధికారులు చెబుతున్నారు. నాగుపాము, కట్లపాము, రక్త పింజర, పాలకుచ్చు పాములు ప్రమాదకరమని చెబుతున్నారు. పాములు చెవిటివి అని, కదలికలను, వైబ్రేషన్లను బట్టే గుర్తిసాయని, వర్షాకాలంలో పాములు బయటకు ఎక్కువగా వస్తాయని, ఇళ్లలో ఎలుకలు లేకుండా చూసుకుంటే పాములు ఎక్కువగా రాకుండా జాగ్రత్త పడవచ్చని చెబుతున్నారు.


పాములతోనే నా జీవితం ముడిపడి ఉంది..

  • జగదీష్‌, స్నేక్‌ క్యాచర్‌, వేములవాడ

పాములతోనే నా జీవితం ముడిపడింది. నాకు పాముల జగదీష్‌గానే గుర్తింపు వచ్చింది. పాములను చూసి భయపడకుండా, గందరగోళానికి గురికాకుండా జాగ్రత్త పడాలి. వెంటనే పాములను అదుపులోకి తీసుకునే నిపుణులకు సమాచారం అందించాలి. పాములను చంపకుండా చూడాలి. పాములు రైతు నేస్తాలు. పాములతో రైతులకు ఎంతో మేలు జరుగుతుం ది.పాముకాటు వేస్తే భయపడకుండా ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి తగిన చికిత్స అందించాలి.


ఈ వార్తలు కూడా చదవండి:

రికార్డు స్థాయిలో పసుపు ధర

ఐదు రోజులు మోస్తారు వర్షాలు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jul 16 , 2026 | 01:37 PM