తేజస్వి అంశంపై పొన్నం ప్రభాకర్ లేఖ.. డీజీపీ స్పందన ఇదే
ABN , Publish Date - Apr 17 , 2026 | 01:24 PM
బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య విషయంలో చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డికి మంత్రి పొన్నం ప్రభాకర్ లేఖ రాశారు. ఈ లేఖపై డీజీపీ స్పందించారు.
కరీంనగర్, ఏప్రిల్ 17: తెలంగాణ విభజనపై పార్లమెంట్‌లో బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలను మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) తీవ్రంగా ఖండించిన విషయం తెలిసిందే. ఎంపీ విషయంలో చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డికి(DGP Shivadhar Reddy) మంత్రి లేఖ రాశారు. ఈ లేఖపై డీజీపీ స్పందించారు. చట్టసభల్లో మాట్లాడిన అంశాలపై చర్యలు తీసుకునే అధికారం పోలీసులకు ఉండదని డీజీపీ శివధర్ రెడ్డి స్పష్టం చేశారు.
ఎంపీపై మండిపడ్డ మంత్రి పొన్నం
తెలంగాణ విభజనపై బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచేలా తేజస్వి మాట్లాడుతుంటే బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు మౌనంగా ఉన్నారని మంత్రి మండిపడ్డారు. తెలంగాణ ఏర్పాటును భారత్-పాకిస్తాన్ విభజనతో పోల్చడం సరికాదన్నారు. ఎంపీపై చర్యలు తీసుకోవాలని డీజీపీ శివధర్‌రెడ్డిని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు.
ఎంపీ తేజస్వి ఏమన్నారంటే
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో డీలిమిటేషన్‌పై చర్చలో ఎంపీ తేజస్వి సూర్య పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర విభజనను ప్రస్తావిస్తూ.. బ్రిటీష్ వాళ్లు చేసిన భారత్- పాకిస్తాన్ విభజనకంటే దారుణంగా ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణను వేరే చేశారంటూ ఎంపీ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ విభజనపై ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి.
ఇవి కూడా చదవండి...
తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించిన వ్యక్తి రేవంత్ రెడ్డి: కేంద్ర మంత్రి బండి సంజయ్
పార్లమెంట్‌లో టీబీజేపీ ఎంపీల మౌనానికి కారణమేంటి: వేముల వీరేశం
Read Latest Telangana News And Telugu News