Share News

పార్లమెంట్‌లో టీబీజేపీ ఎంపీల మౌనానికి కారణమేంటి: వేముల వీరేశం

ABN , Publish Date - Apr 17 , 2026 | 01:00 PM

పార్లమెంట్‌లో తెలంగాణ విభజనను ఎంపీ తేజస్వి సూర్య అవమానిస్తుంటే టీబీజేపీ ఎంపీలు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రభుత్వ విప్ వేముల వీరేశం ప్రశ్నించారు.

పార్లమెంట్‌లో టీబీజేపీ ఎంపీల మౌనానికి కారణమేంటి: వేముల వీరేశం
Vemula Veeresham

హైదరాబాద్, ఏప్రిల్ 17: పార్లమెంట్‌లో తెలంగాణ పట్ల బీజేపీ విషం చిమ్మిందని ప్రభుత్వ విప్ వేముల వీరేశం(Vemula Veeresham) ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. తల్లిని చంపి బిడ్డను బతికించారంటూ ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) చాలాసార్లు మాట్లాడారని గుర్తు చేశారు. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య దారుణంగా తెలంగాణ విభజనను అవమానిస్తుంటే టీబీజేపీ ఎంపీలు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ వ్యతిరేకి కాబట్టే ఆయన మాట్లాడరని విమర్శిస్తూ.. మిగతా తెలంగాణ ఎంపీలకు ఏమైంది? ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు.


ఎంపీ తేజస్వి సూర్య మాటలు తెలంగాణనే కాదు రాష్ట్రం కోసం ప్రాణాలు త్యాగం చేసిన అమరవీరులని అవమానిచ్చినట్లుగా ఉన్నాయని వీరేశం అన్నారు. బీజేపీ సిద్ధాంతం ఇదేనా రాష్ట్ర బీజేపీ నాయకులు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇదే బీజేపీ పార్టీ లైన్ అయితే నెక్స్ట్ వచ్చే ఎంపీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు బీజేపీకి బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఎంపీ తేజస్వి స్వతహాగా మాట్లాడలేదని.. ఆయన స్వతహాగా మాట్లాడితే బీజేపీ ఎంపీలు మౌనంగా ఉండరని అన్నారు. బీజేపీ నాయకులు కావాలనే తెలంగాణ రాష్ట్రంపై విమర్శలు చేయించారని ఆరోపించారు. రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలు బీజేపీకి బుద్ధి చెప్పాలని ప్రభుత్వ విప్ వేముల వీరేశం కోరారు.


ఇవి కూడా చదవండి...

శాస్త్రిపురం ఆర్‌వోబీని ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు

తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించిన వ్యక్తి రేవంత్ రెడ్డి: కేంద్ర మంత్రి బండి సంజయ్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Apr 17 , 2026 | 01:56 PM