Share News

శాస్త్రిపురం ఆర్‌వోబీని ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు

ABN , Publish Date - Apr 17 , 2026 | 10:50 AM

శాస్త్రిపురం రైల్వే ఓవర్ బ్రిడ్జ్‌ను మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. ఈ ఫ్లైఓవర్ నిర్మాణానికి జీహెచ్ఎంసీ 71 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. సుమారు 490 మీటర్ల పొడవుతో, నాలుగు లైన్లలో ఫ్లైఓవర్‌ను నిర్మించారు.

శాస్త్రిపురం ఆర్‌వోబీని ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు
Shastripuram ROB

హైదరాబాద్, ఏప్రిల్ 17: హైదరాబాద్ నగర అభివృద్ధిలో కీలక అడుగుపడింది. నగరంలో మరో ఆర్‌వోబీ(ROB) ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ఈరోజు(శుక్రవారం) శాస్త్రిపురం రైల్వే ఓవర్ బ్రిడ్జ్‌ను మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) ప్రారంభించారు. ఈ ఫ్లైఓవర్ నిర్మాణానికి జీహెచ్ఎంసీ 71 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. సుమారు 490 మీటర్ల పొడవుతో, నాలుగు లైన్లలో ఫ్లైఓవర్‌ను జీహెచ్‌ఎంసీ నిర్మించింది.


rob-sridharbabu.jpg

జీహెచ్ఎంసీ, సౌత్ సెంట్రల్ రైల్వేల సమన్వయంతో ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టారు. శాస్త్రిపురం ఫ్లైఓవర్ అందుబాటులోకి రావడంతో మైలార్ దేవ్‌పల్లి నుంచి ఫలక్‌నుమా మార్గంలో ప్రయాణం సులభతరం అయింది. ఉద్దమ్‌గడ్డ రైల్వే లెవల్ క్రాసింగ్ వద్ద ఏర్పడే ట్రాఫిక్ జామ్‌‌కు చెక్ పడనుంది. ప్రయాణ సమయం కూడా చాలా వరకు తగ్గనుంది. ఈ ఫ్లైఓవర్ ద్వారా మైలార్‌దేవ్‌పల్లి, వట్టెపల్లి, ఫలక్‌నుమా, ఆర్టీసీ బస్ డిపో ప్రాంతాల మధ్య కనెక్టివిటీ మెరుగుపడింది.


ఇవి కూడా చదవండి...

అనకాపల్లిలో స్వల్ప భూకంపం

కూలర్ రిపేర్ చేస్తూ ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి

Read Latest Telangana News And Telugu News

Updated Date - Apr 17 , 2026 | 11:12 AM