అనకాపల్లిలో స్వల్ప భూకంపం
ABN , Publish Date - Apr 17 , 2026 | 09:56 AM
అనకాపల్లి జిల్లా ఎలమంచిలి పరిసర ప్రాంతాల్లో స్వల్ప భూకంపం సంభవించింది. అర్ధరాత్రి 12:28 గంటల సమయంలో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించిందని స్థానికులు చెబుతున్నారు.
అనకాపల్లి జిల్లా, ఏప్రిల్ 17: అనకాపల్లి జిల్లా ఎలమంచిలి పరిసర ప్రాంతాల్లో స్వల్ప భూకంపం సంభవించింది. అర్ధరాత్రి 12:28 గంటల సమయంలో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించిందని స్థానికులు చెబుతున్నారు. ఎలమంచిలి పట్టణంతో పాటు, మండలంలోని పలు గ్రామాలలో అర్ధరాత్రి సమయంలో భూమి కంపించింది. భూకంప తీవ్రత రెక్టార్స్ స్కేల్‌పై 3.7గా నమోదు అయ్యింది. భూమికి 20 కిలోమీటర్ల లోతులో భూకంపం వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. అర్ధరాత్రి సమయంలో భూమి కంపించడంతో నిద్రలో ఉన్న ప్రజలు ఉలిక్కిపడ్డారు. భూకంపంతో భయాందోళనకు గురైనట్లు స్థానికులు తెలిపారు.
ఇవి కూడా చదవండి...
తండ్రి మృతి తట్టుకోలేక కుమార్తె ఆత్మహత్య
సింహాచలం అప్పన్న చందనోత్సవం.. భక్తులకు కీలక సూచన
Read Latest AP News And Telugu News