Share News

సింహాచలం అప్పన్న చందనోత్సవం.. భక్తులకు కీలక సూచన

ABN , Publish Date - Apr 17 , 2026 | 09:02 AM

సింహాచలంలో కొలువుదీరిన శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి చందనోత్సవానికి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో దేవస్థానం ఉన్నతాధికారులు భక్తులకు కీలక సూచన చేశారు.

సింహాచలం అప్పన్న చందనోత్సవం.. భక్తులకు కీలక సూచన
Simhachalam Temple

విశాఖపట్నం, ఏప్రిల్17: సింహాచలంలో కొలువుదీరిన శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి చందనోత్సవానికి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో దేవస్థానం ఉన్నతాధికారులు భక్తులకు కీలక సూచన చేశారు. ఏప్రిల్ 17వ తేదీ (శుక్రవారం) నుంచి చందనోత్సవానికి బ్యాంకుల్లో జారీ చేసే టికెట్ల విక్రయాన్ని పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఈ రోజు నుంచి.. (ఏప్రిల్ 17వ తేదీ) ఆన్‌లైన్‌లో, ‘మన మిత్ర’ వాట్సాప్ ద్వారా ఈ టికెట్లు ఈ ఒక్కరోజు మాత్రమే అందుబాటులో ఉంటాయని వారు స్పష్టం చేశారు. ఈ రోజు ఉదయం 8.00 గంటల నుంచి చందనోత్సవం టికెట్ల విక్రయం ప్రారంభమవుతుందని అధికారులు వివరించారు.


టికెట్ల వివరాలు:

మన మిత్ర ద్వారా రూ.1000 టికెట్లు.. (460 టికెట్లు లభ్యం)

రూ.300 టికెట్లు (750 టికెట్లు లభ్యం).

ఆన్‌లైన్ ద్వారా రూ.1000 టికెట్లు (2,215 టికెట్లు లభ్యం)

రూ.300 టికెట్లు (3,370 టికెట్లు లభ్యం).


ఏప్రిల్ 17వ తేదీ ఉదయం 8 గంటల నుంచి ఈ టికెట్లు భక్తులకు అందుబాటులో ఉంటాయి. భక్తులు టికెట్లను దేవస్థానం అధికారిక వెబ్‌సైట్ https://chandanotsavam.ap.gov.in లేకుంటే ప్రభుత్వ అధికారిక వాట్సాప్ నెంబర్ 9552300009 మన మిత్ర ద్వారా బుక్ చేసుకోవచ్చునని అధికారులు వివరించారు. ఈ విషయాన్ని గమనించాలని భక్తులకు సూచించారు. చివరి నిమిషంలో ఇబ్బందులు పడకుండా, అందుబాటులో ఉన్న టికెట్లను ముందుగానే బుక్ చేసుకోవాలని భక్తులకు వారు స్పష్టం చేశారు. ఏప్రిల్ 20వ తేదీన సింహాచలంలో స్వామి వారికి చందనోత్సవం నిర్వహించనున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

చైత్ర అమావాస్య.. ఈ రాశుల వారు ఇలా చేస్తే..

భీమిలి సమీపంలో రోడ్డు ప్రమాదాలు.. ఒకరి మృతి, పలువురికి గాయాలు

For More AP News And Telugu News

Updated Date - Apr 17 , 2026 | 10:07 AM