డిమాండ్ల పరిష్కారం కోసం నేడు తెలంగాణ ఎంప్లాయిస్ జేఏసీ నిరసన
ABN , Publish Date - Apr 17 , 2026 | 09:55 AM
తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ ఎంప్లాయిస్ జేఏసీ విజ్ఞప్తి చేసింది. అందుకోసం శుక్రవారం తెలంగాణ ఎంప్లాయిస్ జేఏసీ నిరసన చేపట్టనుంది.
హైదరాబాద్, ఏప్రిల్ 17: తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ ఎంప్లాయిస్ జేఏసీ (టీఈజీజేఏసీ) విజ్ఞప్తి చేసింది. అందుకోసం శుక్రవారం నిరసనలు చేపట్టనున్నట్లు తెలిపింది. ఈ రోజు మండల, రెవెన్యూ, జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద భోజన విరామ సమయంలో ఈ నిరసనలు తెలియజేస్తామని టీఈజీజేఏసీ ప్రకటించింది. ప్రధానంగా తమ నాలుగు డిమాండ్లతోపాటు మొత్తం 64 డిమాండ్లను నెరవేర్చాలంటూ జేఏసీ ఇప్పటికే ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఎంప్లాయిస్ జేఏసీ డిమాండ్లు ఇవి..
జూన్ 2వ తేదీ నాటికి పీఆర్సీ అమలు చేయాలి.
రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ బిల్స్ అన్ని క్లియర్ చేయాలి.
హెల్త్ కార్డులను తక్షణమే అమలు చేయాలి.
సీపీఎస్ (CPS) రద్దు చేసి ఓపీఎస్ (OPS) పునరుద్ధరించాలి.
2004 సెప్టెంబర్ 1వ తేదీకి ముందు నియామితులైన ఉద్యోగులకు ఓపీఎస్ అమలు చేయాలి.
పెండింగ్ బిల్లులతో పాటు పెండింగ్ డీఏ (DA)లను వెంటనే విడుదల చేయాలి.
గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం 61 సంవత్సరాలు నిండిన వీఆర్ఏ (VRA)ల సమస్యలు పరిష్కరించాలి.
ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలి.
ఉద్యోగ, ఉపాధ్యాయుల సాధారణ బదిలీలు చేపట్టాలి.
ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలి.
ఈ వార్తలు కూడా చదవండి..
సింహాచలం అప్పన్న చందనోత్సవం.. భక్తులకు కీలక సూచన
For More TG News And Telugu News