తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించిన వ్యక్తి రేవంత్ రెడ్డి: కేంద్ర మంత్రి బండి సంజయ్
ABN , Publish Date - Apr 17 , 2026 | 12:34 PM
తెలంగాణ రాష్ట విభజన సమయంలో కాంగ్రెస్ తప్పిదాలతో యువకులు ఆత్మబలిదానాలు చేసుకున్నారని ఎంపీ తేజస్వి సూర్య చెప్పారని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. 2009లో కాంగ్రెస్ తెలంగాణ ఏర్పాటుకు సహకరించి మళ్లీ వెన్నక్కి తగ్గారని.. దీని గురించే తేజస్వి సూర్య మాట్లాడారని అన్నారు.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 17: తెలంగాణ విభజనపై బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య మాటలను కాంగ్రెస్ నేతలు తప్పుబడుతున్నారంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. రాష్ట విభజన సమయంలో కాంగ్రెస్ తప్పిదాలతో పలువురు యువకులు ఆత్మబలిదానాలు చేసుకున్నారని ఎంపీ తేజస్వి సూర్య చెప్పారని తెలిపారు. 2009లో కాంగ్రెస్ తెలంగాణ ఏర్పాటుకు సహకరించి మళ్లీ వెన్నక్కి తగ్గారని.. దీని గురించే తేజస్వి సూర్య మాట్లాడారని అన్నారు. రేవంత్ రెడ్డి గతంలో సోనియాగాంధీని బలిదేవత అన్నారన్న విషయాన్ని గుర్తుచేశారు. తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించిన వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డి అంటూ విమర్శించారు.
కరీంనగర్‌లో రణభేరి కార్యక్రమానికి రేవంత్ రెడ్డి తుపాకీ పట్టుకొని వెళ్లారని కేంద్ర మంత్రి తెలిపారు. 1400 మంది బలిదానాలకు హత్యలకు కారణమైన పార్టీ కాంగ్రెస్ అని ఆరోపించారు. ఒక్క ఓటు, రెండు రాష్ట్రాలు అనే నినాదానికి కట్టుబడి, రాష్ట్ర విభజనకు మద్దతు ఇచ్చింది బీజేపీ అని తెలిపారు. మహిళా రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్ కావాలని అడ్డుకుంటోందని మండిపడ్డారు. బీఆర్‌ఎస్ అవినీతి గురించి సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడటం లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు.
ఇవి కూడా చదవండి...
కూలర్ రిపేర్ చేస్తూ ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి
శాస్త్రిపురం ఆర్‌వోబీని ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు
Read Latest Telangana News And Telugu News