Share News

నాన్‌ ఇంటర్‌లాకింగ్‌ పనులతో 10న పలు రైళ్ల రద్దు

ABN , Publish Date - Sep 05 , 2026 | 12:12 PM

కాజీపేట-బల్లార్షా రైల్వే సెక్షన్‌లో ఆటోమేటిక్‌ బ్లాక్‌ సిగ్నలింగ్‌ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చే ప్రక్రియ తుది దశకు చేరుకుంటోంది.

నాన్‌ ఇంటర్‌లాకింగ్‌ పనులతో 10న పలు రైళ్ల రద్దు
September 10 train cancellations,

  • మరికొన్ని రైళ్లు రీషెడ్యూల్‌

పెద్దపల్లి: కాజీపేట-బల్లార్షా రైల్వే సెక్షన్‌లో ఆటోమేటిక్‌ బ్లాక్‌ సిగ్నలింగ్‌ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చే ప్రక్రియ తుది దశకు చేరుకుంటోంది. ఇందులో భాగంగా జమ్మికుంట-పొత్కపల్లి మధ్య 17 కిలోమీటర్ల మేర ఆటోమేటిక్‌ బ్లాక్‌ సిగ్నలింగ్‌ వ్యవస్థ ఏర్పాటుకు నాన్‌ ఇంటర్‌ లాకింగ్‌ పనులు చేపడుతున్నారు. దీంతో దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్‌ డివిజన్‌ అధికారులు ఈనెల 10న పలు రైళ్లను పూర్తిగా, మరికొన్నిం టిని పాక్షికంగా రద్దు చేయడంతోపాటు దూర ప్రాంతాల సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌లను 30 నుం చి 75 నిమిషాల వరకు నియంత్రించ నున్నా రు. దీంతో పలు రైళ్లపై ప్రభావం పడనున్నది.


ఈనెల 10న 17003/04 కాజీపేట-సిర్పూర్‌ టౌన్‌, బల్లార్షా- కాజీపేట రామగిరి మెము ఎక్స్‌ప్రెస్‌ను పూర్తిగా రద్దు చేశారు. 17033/34 భద్రాచలం రోడ్‌-బల్లార్షా, సిర్పూర్‌ టౌన్‌-భద్రా చలం రోడ్‌ సింగరేణి మెము ఎక్స్‌ప్రెస్‌ను వరం గల్‌-బల్లార్షా, సిర్పూర్‌ టౌన్‌-వరంగల్‌ మధ్య పాక్షికంగా రద్దు చేశారు. అలాగే 17011/12 హైదరాబాద్‌-సిర్పూర్‌ కాగజ్‌నగర్‌-బీదర్‌ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ను కాజీపేట-సి ర్పూర్‌ కాగజ్‌నగర్‌ మధ్య పాక్షి కంగా రద్దు చేశారు. 10న సికింద్రాబాద్‌ నుంచి బయలుదేరే 17233 భాగ్యనగర్‌ ఎక్స్‌ప్రెస్‌ను గంటపాటు రీషెడ్యూల్‌ చేశారు.


67771/73 సిర్పూర్‌ టౌన్‌-కరీంనగర్‌, కరీంనగర్‌-బోధన్‌ మెము ప్యాసింజర్‌ రైలును కూడా గంట పాటు రీషెడ్యూల్‌ చేశారు. సెప్టెంబరు 9న 22365 దానాపూ ర్‌-ఎస్‌ఎంవీటీ బెంగళూరు సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ను 75 నిమిషాలు, 22366 ఎస్‌ఎంవీటీ బెంగళూరు-దానాపూర్‌ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ ను 45 నిమిషాలు నియంత్రించనున్నారు. ఈనెల 10న 12622 చెన్నై సెంట్రల్‌-శ్రీమాత వైష్ణోదేవి కట్రా అండమాన్‌ ట్రైవీక్లీ ఎక్స్‌ప్రెస్‌ను 30 నిమిషాలు, ఈనెల 9న 12622 న్యూఢిల్లీ- చెన్నై సెంట్రల్‌ తమిళనాడు సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ ప్రెస్‌ను 30నిమిషాలు నియంత్రించనున్నారు.


pdp1.2.jpgకాజీపేట-జమ్మికుంట, మంచిర్యాల-సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ మధ్య ఆటోమేటిక్‌ బ్లాక్‌ సిగ్నలింగ్‌ వ్యవస్థ ఇప్పటికే అందుబాటు లోకి వచ్చింది. ప్రస్తుతం పెద్దపల్లి జిల్లా పరిధి లోని కొన్ని ప్రాంతా ల్లోనే పనులు మిగి లి ఉన్నాయి. జ మ్మికుంట-పొత్క పల్లి మధ్య పను లు పూర్తయిన అ నంతరం పొత్కప ల్లి-పెద్దంపేట మధ్య పనులను రైల్వే అధికారులు వేగవంతం చేస్తున్నారు.


  • ఆటోమేటిక్‌ సిగ్నలింగ్‌ వ్యవస్థ

కాజీపేట- బల్లార్షా మధ్య సుమారు 235 కిలోమీటర్ల మేర ఆటోమేటిక్‌ బ్లాక్‌ సిగ్నలింగ్‌ వ్యవస్థ అందుబాటులోకి వస్తే రైళ్ల రాకపోకల సామర్థ్యం పెరగడంతోపాటు సిగ్నల్‌ కారణంగా ఏర్పడే ఆలస్యాలను తగ్గించే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ మార్గంలో మూడో రైల్వే లైన్‌ పూర్తయి వినియోగంలోకి రావడంతో ఆటోమేటి క్‌ సిగ్నలింగ్‌ వ్యవస్థ అందుబాటులోకి రావడం రైళ్ల రాకపోకలకు ప్రయోజనం చేకూరుస్తున్నది.


ఈ వార్తలు కూడా చదవండి:

మల్కాజిగిరి నియోజకవర్గంలో 48,505 మందికి ‘సర్‌’ నోటీసులు

లాటరీలో గెలవగానే ఇల్లు వచ్చినట్లు కాదు!

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Sep 05 , 2026 | 12:12 PM