Share News

మహిళా సంఘాలకు డ్రోన్లు

ABN , Publish Date - Nov 07 , 2026 | 01:05 PM

డిజిటల్‌ వ్యవసాయంలో భాగంగా గ్రామీణ మహిళల ఉపాధి కల్పన లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం నమో డ్రోన్‌ దీదీ పథకాన్ని తీసుకువచ్చింది.

మహిళా సంఘాలకు డ్రోన్లు
Drone Subsidy

  • గ్రామీణ మహిళల కోసం నమో డ్రోన్‌ దీదీ పథకం

  • రైతులకు సాంకేతికతను చేరువచేయడమే లక్ష్యం

చొప్పదండి(కరీంనగర్): డిజిటల్‌ వ్యవసాయంలో భాగంగా గ్రామీణ మహిళల ఉపాధి కల్పన లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం నమో డ్రోన్‌ దీదీ పథకాన్ని తీసుకువచ్చింది. వ్యవసాయ ఆధారిత ఉపాధి మార్గంగా మహిళలు జీవితాల్లో మార్పు తేవడంతో పాటు ఆధునిక సాంకేతికతను రైతులకు చేరవేడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకువచ్చింది. మహిళా సాధికారిత, వ్యవసాయం లో ఆధునికత, నైపుణ్య అభివృద్ధితో పాటు గ్రామీణ మహిళలు ఆర్థికంగా ఎదగడానికి డ్రోన్‌ దీదీ నూతన అవకాశాలను కల్పిస్తుంది. ఈ ఆర్థిక సంవత్సరానికి ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుండగా ఆసక్తి ఉన్న మహిళా సంఘాలు దరఖాస్తు చేసుకోవచ్చు.


  • డ్రోన్‌ సేవలు

సబ్సిడీపై అందే డ్రోన్లతో ఎస్‌హెచ్‌సీ గ్రూపులు వ్యవసాయంలో రైతులకు సహా యకారిగా పనిచేస్తాయి. ప్రతియేటా కనీ సం లక్ష రూపాయల ఆదాయాన్ని పొం దుతాయి. పంట పొలాలపై ఎరువులు, పురుగు మందుల పిచికారితో పాటు పంట సర్వేలు, మ్యాపింగ్‌, డేటా అనాలసిస్‌ లాంటి పనులను డ్రోన్‌ ద్వారా సంఘాల సభ్యులు నిర్వహిస్తారు. వ్యవసాయాధారిత డ్రోన్‌ ద్వారా సంఘాలకు ఆదాయంతో పాటు మహిళల జీవితాల్లో మార్పు తీసుకువస్తాయి.


drone1.2.jpgప్రస్తుతం పంట పొలాలకు ఎరువులు, పురుగు మందుల పిచికారి కోసం రైతులు డ్రోన్లను ఉపయోగి స్తున్నారు. ఎకరానికి 300 నుంచి 500 రూపాయల వరకు డ్రోన్‌ ఆపరేటర్లు చార్జి చేస్తున్నారు. డ్రోన్‌ ద్వారా మహిళా సంఘాలకు ఆదాయం తెచ్చిపెట్ట నుంది. స్వయం సహాయక గ్రూపులు నమో డ్రోన్‌ దీదీ కోసం వ్యవసాయ శాఖ లేదా కృషి విజ్ఞాన కేంద్రాలను సంప్రదించాలి.


నమో డ్రోన్‌ దీదీ లాభాలు

ఈ పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా 15 వేల మహిళా గ్రూపులకు డ్రోన్లను అందించనున్నారు. ప్రతి డ్రోన్‌ కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వం 40 శాతం సబ్సిడీ అందజేస్తుంది. గరిష్టంగా రూ. 8 లక్షల వరకు డ్రోన్‌ కొనుగోలుపై సబ్సిడీ అందుతుంది. మిగతా డబ్బులను అగ్రికల్చర్‌ ఇన్‌ఫ్రా స్ట్రక్చర్‌ ఫండ్‌ ద్వారా 3 శాతం వడ్డీపై రుణం అందజేస్తారు. పథకానికి ఎంపికైన సంఘ సభ్యులకు డ్రోన్‌ నడిపేందుకు శిక్షణ అందిస్తారు. కేంద్ర ప్రభుత్వ మద్దతుతో డ్రోన్‌ను సంఘాలకు అందజేస్తారు. డ్రోన్‌ శిక్షణ కోర్సును డీజీసీఏ అంగీకరిస్తుంది. రైతులకు డ్రోన్‌ ద్వారా సేవలందించేందుకు వ్యవసాయ శాఖ మహిళా సంఘాలకు మద్దతు ఇస్తుంది. డ్రోన్‌ తయారీ దారులు, శిక్షణ సంస్థలు, వ్యవసాయశాఖ కూడా సంఘాలకు సహకారం అందిస్తాయి.


ఈ వార్తలు కూడా చదవండి:

దీపావళికి స్వీట్లు, డ్రైఫ్రూట్స్‌ అమ్మకాల్లో రికార్డులు

చర్లపల్లి-రక్సాల్‌ మధ్య ఆరు ప్రత్యేక రైళ్లు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Nov 07 , 2026 | 01:06 PM