హైదరాబాద్‌లో విషాదం.. హోటల్ మేనేజ్‌మెంట్ విద్యార్థి ఆత్మహత్య
ABN , Publish Date - Nov 07 , 2026 | 11:34 AM
హైదరాబాద్ నగరంలోని ఎస్‌ఆర్ నగర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ హోటల్ మేనేజ్‌మెంట్ కాలేజీలో చదువుతున్న ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది.
హైదరాబాద్, నవంబర్ 7: నగరంలోని ఎస్‌ఆర్ నగర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ హోటల్ మేనేజ్‌మెంట్ కాలేజీలో చదువుతున్న ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. విద్యార్థి మృతికి కళాశాల ప్రిన్సిపాల్ వేధింపులే కారణమని తోటి విద్యార్థులు ఆరోపిస్తున్నారు.
ఈ ఘటనతో ఆగ్రహానికి గురైన విద్యార్థులు పెద్ద సంఖ్యలో కళాశాల ఎదుటకు చేరుకుని భారీ ఆందోళన చేపట్టారు. విద్యార్థిని ఏ విధంగా వేధించారు? ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులు ఏంటి? అనే విషయాలపై స్పష్టత రావాల్సి ఉందని వారు పేర్కొన్నారు. తమ తోటి విద్యార్థి మృతికి బాధ్యులైన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దీంతో కళాశాల పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేయడంతో పాటు ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.
మరోవైపు.. విద్యార్థి మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రిన్సిపాల్‌పై వచ్చిన వేధింపుల ఆరోపణలను అధికారులు నిష్పక్షపాతంగా పరిశీలించాలని.. విచారణలో ఆరోపణలు నిజమని తేలితే బాధ్యులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాయి. ప్రైవేటు విద్యాసంస్థల్లో విద్యార్థులపై ఒత్తిడి.. వేధింపులను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని విద్యార్థి సంఘాల నాయకులు అభిప్రాయపడుతున్నారు.
ఇవీ చదవండి:
కర్ణాటకలో పెట్రోల్‌లో 31 శాతం ఇథనాల్
తరుణ్ తేజ్‌పాల్ శిక్ష నిలిపివేతకు సుప్రీం నో