Share News

కర్ణాటకలో పెట్రోల్‌లో 31 శాతం ఇథనాల్‌

ABN , Publish Date - Nov 07 , 2026 | 06:21 AM

కర్ణాటకలోని బంకుల్లో ఈ-20 పేరుతో విక్రయిస్తున్న పెట్రోల్‌లో ఇథనాల్‌ 31శాతం దాకా ఉందని ఆ రాష్ట్ర పౌర ఆహార సరఫరాలశాఖ మంత్రి రిజ్వాన్‌ అర్షద్‌ చెప్పారు

కర్ణాటకలో పెట్రోల్‌లో 31 శాతం ఇథనాల్‌
ehnol

  • కర్ణాటక మంత్రి రిజ్వాన్‌ అర్షద్‌

బెంగళూరు, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): కర్ణాటకలోని బంకుల్లో ఈ-20 పేరుతో విక్రయిస్తున్న పెట్రోల్‌లో ఇథనాల్‌ 31శాతం దాకా ఉందని ఆ రాష్ట్ర పౌర ఆహార సరఫరాలశాఖ మంత్రి రిజ్వాన్‌ అర్షద్‌ చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 63 పెట్రోల్‌ బంకుల్లో తూనికలు, కొలతల విభాగం అధికారులు పరీక్షలు చేస్తే..చాలా చోట్ల పెట్రోల్‌లో 20శాతంకంటే ఎక్కువ ఇథనాల్‌ ఉందని గుర్తించామన్నారు. బెంగళూరు, కోలారు, చిక్కబళ్లాపుర, బెంగళూరు రూరల్‌, రామనగర, తుమకూరు జిల్లాల పరిధిలో నమూనాలను సేకరించామని తెలిపారు. ఐవోసీఎల్‌ బంకుల్లో 31.2శాతం, హెచ్‌పీసీఎల్‌ బంకుల్లో 30.5శాతం ఇథనాల్‌ ఉందని తెలిపారు. ఆయిల్‌ కంపెనీలు సొంతల్యాబ్‌ల్లో పరీక్షలు చేయించి ఫలితాలను దాచి ఉంచాయని, అందుకే తాము నమూనాలు సేకరించి పరీక్షలు చేయించామని తెలిపారు. వినియోగదారులను ఆయిల్‌ కంపెనీలు మోసం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం వాస్తవాలను ప్రజలకు చెప్పాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - Nov 07 , 2026 | 06:32 AM