ఉపాధిహామీ పనులపై డిజిటల్ నిఘా.. నకిలీ హాజరుకు చెక్
ABN , Publish Date - Sep 26 , 2026 | 12:10 PM
ఉపాధిహామీ పనుల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు తీసుకొచ్చిన డిజిటల్ ఆధారిత పర్యవేక్షణ విధా నానికి మూడు నెలలు అవుతుంది.
మస్టర్ల నుంచి కొలతల వరకు పర్యవేక్షణ
నకిలీ హాజరు, బినామీ పనులకు చెక్ పెట్టేలా కొత్త విధానం
జమ్మికుంట(కరీంనగర్): ఉపాధిహామీ పనుల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు తీసుకొచ్చిన డిజిటల్ ఆధారిత పర్యవేక్షణ విధా నానికి మూడు నెలలు అవుతుంది. ఇన్నాళ్లు మస్టర్లలో పేర్లు, కొలతల్లో తేడాలు, పనులు చేయకుండానే హాజ రు, ఒకరి స్థానంలో మరొకరు పనులకు వచ్చినట్లు చూపించడం వంటి అవకతవకలకు ఆస్కారం ఉం డేది. కొత్త సాంకేతిక విధానంలో ప్రతి దశను డిజిట ల్‌గా నమోదు చేస్తుండడంతో క్షేత్రస్థాయిలో అక్రమాలకు ఎంతమేర అడ్డుకట్ట పడిందన్నది ఇప్పుడు చర్చ నీయాంశగా మారింది.
ఉదయం, మధ్యాహ్నం కూలీల హాజరు ఫొటోలు తీసే విధానాన్ని ఏఐ ఆధారిత వ్యవస్థతో అనుసంధానించారు. రెండు సమ యాల్లో తీసిన పొటోల్లో కూలీల హాజరు, పని పరిస్థితులను సాంకేతికంగా పరిశీలించేలా ఏర్పాట్లు చేశారు. పని ప్రదేశంలో వాస్త వంగా పనులు జరుగుతున్నాయా, హాజరైన కూలీలే పనిలో ఉన్నారా వంటి అంశాలను డిజిటల్ రికార్డులతో అనుసంధానించే అవకాశం ఏర్పడింది. దీంతో కాగితాలపై మస్టర్లు నిర్వహించే పాత పద్ధతికి క్రమంగా తెరపడుతోంది.
మూడు నెలల్లో ఎంత మార్పు
ఏఐ ఆధారిత పర్యవేక్షణ అమల్లోకి వచ్చి మూడు నెలలు కావాస్తున్నా.. అస లు పరీక్ష మాత్రం క్షేత్ర స్థాయిలో ఉంది. సాంకేతిక వ్యవస్థ పనిచేస్తోందా, నకిలీ మస్టర్లు తగ్గాయా, పనలు చేయ కుండా హాజరు చేసే పద్ధతికి అడ్డుకట్ట పడిం దా, కొలతల్లో అక్రమాలకు అవకాశం లేకుండా పోయిందా అన్నది రానున్న రోజుల్లో తేలుతుంది. సాంకేతిక నిఘా కేవలం యాప్‌లు, ఫొటోలు, డిజిటల్ రికా ర్డులకే పరిమితం కాకుండా వాటి ఆధారంగా చర్యలు తీసుకున్నప్పుడే అసలు ఉద్దేశం నెరవేరుతుందన్న అభిప్రాయం వ్యక్తమవు తోంది. కొత్త విధా నంలో 125 రోజుల పని కల్పించే లక్ష్యం ఉండడంతో పనిదినాలు పెరిగాయి. నిజమైన కూలీలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడడం, నెట్‌వర్క్ లేదా సాంకేతిక సమస్యల కార ణంగా హాజరు నమోదులో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవడం అధికారుల ముందున్న మరో బాధ్యతగా మారింది.
కొలతల్లో తేడా వస్తే చిక్కులే..
పనులు పూర్తయ్యాయని ఎంబుక్‌లో నమోదు చేసే కొలతలకు క్షేత్రస్థాయిలో సాంకేతికంగా నమోదయ్యే వివరాలకు పొంతన లేకుంటే అధికారులపై ప్రశ్నలు తలెత్తే పరిస్థితి ఏర్పడింది. శాటిలైట్ చిత్రాలు, డ్రోన్ సర్వేలు, డిజిటల్ రికార్డులను ఆధారంగా చేసుకుని పనుల ప్రామాణికతను పరిశీలించే విధానం అమల్లోకి వచ్చింది. ఎంబుక్ నమోదు వివరాలు, క్షేత్ర స్థాయి వాస్తవాలకు తేడా ఉంటే విచా రణకు అవకాశం ఉంటుంది. అక్రమాలు జరిగాయని తేలితే బాధ్యులపై చర్యలతో పాటు రికవరీకి కూడా అవకాశం కల్పించారు. కూలీల హాజరు, పనుల నమోదు, కొలతలు, చెల్లింపులను డిజిటల్ వ్యవస్థ పర్యవేక్షించాల్సి ఉండడంతో క్షేత్రస్థాయి సిబ్బందిపై బాధ్యత పెరిగింది.
అక్రమాలకు ఆస్కారం ఉండదు..
లక్ష్మణ్, జమ్మికుంట ఏపీవో
ఉపాధిహామి పనుల్లో మస్టర్లు, కొలతలు, హాజరు తదితరఅంశాల్లో గతంలో తప్పులు జరిగేవి. కొత్త విధానం లో అలాంటి వాటికి తావు లేకుండా సాంకేతిక వ్యవస్థను ఏర్పాటు చేశారు. శాటిలైట్, డ్రోన్ ద్వారా నమోదైన వివరాలు, ఎంబుక్ లోని వివరాలు సరిపోలకపోతే విచారణ చేపడుతాం. అక్రమాలు నిర్ధారణ అయితే బాధ్యులపై చర్యలు తీసుకోవడంతో పాటు రికవరీ చేస్తాం.
ఈ వార్తలు కూడా చదవండి:
ఎల్‌నినో వేళ రైతులకు చామంతి కొత్త దారి..
Read Latest AP News And Telangana News And International News And Telugu News