Share News

అత్యాచారం కేసులో కాంగ్రెస్ ఎంపీకి ఊరట.. నిర్దోషిగా విడుదలచేసిన అలహాబాద్ హైకోర్టు

ABN , Publish Date - Sep 26 , 2026 | 11:26 AM

అత్యాచారం కేసులో అరెస్టైన కాంగ్రెస్ ఎంపీ రాకేష్ రాథోర్‌ను నిర్దోషిగా అలహాబాద్ కోర్టు విడుదల చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ సుభాష్ విద్యార్థి శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు.

అత్యాచారం కేసులో కాంగ్రెస్ ఎంపీకి ఊరట.. నిర్దోషిగా విడుదలచేసిన అలహాబాద్ హైకోర్టు
Congress MP Rakesh Rathore

ఇంటర్నెట్ డెస్క్: అత్యాచారం కేసులో అరెస్టైన కాంగ్రెస్ ఎంపీ రాకేష్ రాథోర్‌ను నిర్దోషిగా అలహాబాద్ కోర్టు విడుదల చేసింది. ఫిర్యాదు చేసిన మహిళతో ఆయనకున్న దీర్ఘకాల వివాహేతర సంబంధాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ సుభాష్ విద్యార్థి శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు.


ఉత్తర్‌ప్రదేశ్‌లోని సీతాపూర్ నియోజకవర్గానికి ఎంపీగా ఉన్న రాకేష్ రాథోర్ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసగించారని ఓ మహిళ ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై అత్యాచారం కేసు నమోదైంది. విచారణ చేపట్టిన కోర్టు వీరిద్దరి మధ్య పరస్పర అంగీకారంతోనే దీర్ఘకాల వివాహేతర సంబంధం ఏర్పడిందని గ్రహించింది. రాకేష్ రాథోర్‌కు, ఆమెకు బహిరంగ సమావేశాల్లో పరిచయం ఏర్పడిందని గుర్తించింది. ఆ తరువాత తైలిక్ మహాసంఘ్‌కు సదరు మహిళను ఆయన ప్రెసిడెంట్‌‌గా నియమించారని, ఇలా వీరి మధ్య సాన్నిహిత్యం పెరిగిందని కోర్టు తెలిపింది.


ఫిర్యాదు చేసిన మహిళ భర్త వాంగ్మూలాన్ని కూడా కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ‘తన నివాసం దగ్గరకు రావాలని తరచూ రాకేష్ రాథోర్‌ నా భార్యకు కాల్ చేసేవారు. కొన్ని సార్లు ఆయన దగ్గరకు వెళ్లిన నా భార్య అర్థరాత్రి వరకు తిరిగి వచ్చేది కాదు’ అని మహిళ భర్త పేర్కొన్నారు. ఈ సాక్ష్యాలను పరిశీలించిన కోర్టు.. పరస్పర అంగీకారంతోనే వివాహితులైన రాకేష్ రాథోర్‌, ఆ మహిళ వివాహేతర సంబంధాన్ని కొనసాగించారని వ్యాఖ్యానించింది. ఇది ఆమె చేసిన ఆరోపణకు విరుద్ధంగా ఉందని తెలిపింది. అలాగే ఆ ఆరోపణలకు ఆధారాలు లేవని చెప్పింది.


2020లో రాకేష్ రాథోర్ తనపై అత్యాచారం చేశారని, ఆ తర్వాత పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి తనతో సంబంధం పెట్టుకున్నారని ఆరోపిస్తూ సదరు మహిళ 2025 జనవరిలో సీతాపూర్‌లోని కోత్వాలి పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. విచారణ చేపట్టిన అలహాబాద్ కోర్టు రాకేష్ రాథోర్‌ను నిర్దోషిగా విడుదల చేసింది.


ఈ వార్తలూ చదవండి

లుధియానాలో ఘోర ప్రమాదం.. ఆరు వాహనాలను ఢీకొట్టిన టియాగో ఈవీ..

జ్ఞానేశ్‌ వైదొలగాల్సిందే

Updated Date - Sep 26 , 2026 | 11:30 AM