Share News

2027 గోదావరి పుష్కరాలే లక్ష్యంగా ‘ది గోదావరి కాల్స్‌’ ప్రచారం: మంత్రి దుర్గేష్

ABN , Publish Date - Sep 26 , 2026 | 11:16 AM

రాజమండ్రిలోని మంజీరా హోటల్‌లో రేపు ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నామని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు.

2027 గోదావరి పుష్కరాలే లక్ష్యంగా ‘ది గోదావరి కాల్స్‌’ ప్రచారం: మంత్రి దుర్గేష్
Minister Kandula Durgesh

రాజమండ్రి, సెప్టెంబర్ 26: రాజమండ్రిలోని మంజీరా హోటల్‌లో రేపు(ఆదివారం) ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నామని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఈరోజు(శనివారం) మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ టూరిజంలో ఏఐ టెక్నాలజీ కొత్త శకానికి వేదికవుతుందని అన్నారు. 130కి పైగా ప్రాంతాల్లో ఏఐ-ఎనేబుల్డ్ ‘నివు’ క్యూఆర్ కోడ్స్ ఆవిష్కరణ చేసి.. 130 భాషల్లో మాట్లాడే ఏఐ డిజిటల్ గైడ్‌ను రూపొందించామని తెలిపారు. 2027 గోదావరి పుష్కరాలే లక్ష్యంగా ‘ది గోదావరి కాల్స్’ ప్రచారానికి శ్రీకారం చుట్టామని వెల్లడించారు. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, క్రియేటర్లతో ఏపీ టూరిజంపై ప్రత్యేక ప్రచారం నిర్వహిస్తామని చెప్పారు.


గోదావరి పుష్కరాల ద్వారా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు పర్యాటక రంగంగా అభివృద్ధి చెందుతాయని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్ర స్థాయి వేడుకలకు పర్యాటక రంగానికి చెందిన ప్రముఖులు, టూర్ ఆపరేటర్లు, ఆతిథ్య రంగ ప్రతినిధులు, కంటెంట్ క్రియేటర్లు, టెక్నాలజీ ఇన్నోవేటర్లు హాజరవుతారని తెలిపారు. గోదావరి ప్రాంతంలో క్యూరేటెడ్ ఫామిలియా రైజేషన్ ట్రిప్స్ కోసం విశాఖపట్నం నుంచి హాప్-ఆన్ హాప్-ఆఫ్ డబుల్ డెక్కర్ బస్సులను రాజమండ్రికి తీసుకువస్తున్నామని తెలిపారు.


విశాఖలో రిషికొండ అక్రమ నిర్మాణలపై సబ్ కమిటీ వేశామని మంత్రి తెలిపారు. వైసీపీ వాళ్లు వారి కుటుంబాలు వినియోగించుకునే విధంగా విశాలంగా రూంలను నిర్మించుకున్నారని చెప్పారు. జగన్ మళ్లీ అధికారంలోకి వస్తారానే దురాశతో ప్యాలస్‌లు నిర్మించుకున్నారని మండిపడ్డారు. సీఆర్ జెడ్ 2019 రూల్స్ అందుబాటులోకి రిషికొండ నిర్మాణాలను వినియోగంలోకి తీసుకువస్తామని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

పిక్సెల్స్ అయినా.. పైప్స్ అయినా.. ప్రజల జీవనోపాధి బలోపేతమే లక్ష్యం: సీఎం చంద్రబాబు

రానున్న రోజుల్లో పోలీసు శాఖలో మరిన్ని నియామకాలు: మంత్రి టీజీ భరత్

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 26 , 2026 | 11:31 AM