Share News

పిక్సెల్స్ అయినా.. పైప్స్ అయినా.. ప్రజల జీవనోపాధి బలోపేతమే లక్ష్యం: సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Sep 26 , 2026 | 09:49 AM

అభివృద్ధి ఫలాలు, ప్రజల దైనందిన జీవితాలను మెరుగుపరచడమే తన ధ్యేయమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు.

పిక్సెల్స్ అయినా.. పైప్స్ అయినా.. ప్రజల జీవనోపాధి బలోపేతమే లక్ష్యం: సీఎం చంద్రబాబు
CM Chandrababu Naidu

అమరావతి, సెప్టెంబర్ 26: అభివృద్ధి ఫలాలు, ప్రజల దైనందిన జీవితాలను మెరుగుపరచడమే తన ధ్యేయమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్‌ వేదికగా సీఎం స్పందిస్తూ.. తన పాలనా ప్రయాణం, ప్రస్తుత ప్రాధాన్యాలపై పలు అంశాలను వెల్లడించారు. 1990లలో ఐటీ, సాంకేతిక వ్యవస్థను నెలకొల్పి కొత్త ఆర్థిక అవకాశాలను సృష్టించిన విషయాన్ని ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తుచేశారు. ప్రస్తుతం దశాబ్దాలుగా వేచి చూస్తున్న టెయిల్ ఎండ్(Tail-end) రైతులకు సాగునీరు అందించడమే తన ప్రధాన ప్రాధాన్యమని స్పష్టం చేశారు.


‘పిక్సెల్స్ అయినా.. పైప్స్ అయినా’ ప్రజల సమస్యలను పరిష్కరించి, వారి జీవనోపాధిని బలోపేతం చేయడమే అసలు లక్ష్యమని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి కుటుంబానికి మెరుగైన భవిష్యత్తును నిర్మించడమే అంతిమ ధ్యేయమని స్పష్టం చేశారు. తన పాలనా ప్రయాణంపై ‘పిక్సెల్స్ టు పైప్స్’(Pixels to Pipes) పేరిట కథనాన్ని ప్రచురించిన ‘ది ప్రింట్’, శేఖర్ గుప్తాకు సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలియజేస్తూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.


ఇవి కూడా చదవండి...

గురువులపై దాడి చేసిన ఏ ఒక్కరినీ వదలిపెట్టం

వరదల వేళ చంద్రబాబు కీలక ఆదేశం.. మత్స్యకార కుటుంబాలకు 50 కేజీల బియ్యం

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 26 , 2026 | 10:45 AM