Share News

రానున్న రోజుల్లో పోలీసు శాఖలో మరిన్ని నియామకాలు: మంత్రి టీజీ భరత్

ABN , Publish Date - Sep 26 , 2026 | 10:42 AM

ఏపీఎస్పీ 2వ బెటాలియన్‌లో పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి టీజీ భరత్ .. 629 మంది ట్రైనీ కానిస్టేబుళ్లకు అభినందనలు తెలియజేశారు.

రానున్న రోజుల్లో పోలీసు శాఖలో మరిన్ని నియామకాలు: మంత్రి టీజీ భరత్
Minister TG Bharath

కర్నూలు, సెప్టెంబర్ 26: ఏపీఎస్పీ 2వ బెటాలియన్‌లో పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి టీజీ భరత్(Minister TG Bharath) .. 629 మంది ట్రైనీ కానిస్టేబుళ్లకు అభినందనలు తెలియజేశారు. అనంతరం మాట్లాడుతూ.. యూనిఫాం గౌరవాన్ని, పోలీస్ శాఖ ప్రతిష్ఠను కాపాడేలా విధులు నిర్వహించాలని సూచించారు. సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలు, మహిళలు, చిన్నారులపై నేరాలు అనేవి పోలీసులకు కొత్త సవాళ్లని చెప్పుకొచ్చారు.


మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు, సీసీటీవీ, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలోని ఆధారాలపై అవగాహన అవసరమని మంత్రి అన్నారు. టెక్నాలజీ ఆధారిత పోలీసింగ్, డేటా ఆధారిత నేర నియంత్రణకు భవిష్యత్తులో మరింత ప్రాధాన్యమని వెల్లడించారు. కొత్తతరం పోలీసు సిబ్బంది ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవాలని సూచించారు. కానిస్టేబుల్‌గా పోలీస్ శాఖలోకి అడుగుపెడుతున్న శిక్షణార్థులకు ఇది గొప్ప ప్రారంభమన్నారు.


రానున్న రోజుల్లో సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో పోలీసు శాఖలో మరిన్ని నియామకాలు చేపట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోనుందని మంత్రి తెలిపారు. పోలీసు శాఖను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కర్నూలు రేంజ్ డీఐజీ డా.కోయ ప్రవీణ్, కలెక్టర్ డా.ఏ.సిరి, ఎస్పీ విక్రాంత్ పాటిల్, బెటాలియన్ కమాండెంట్ దీపిక ఎం.పాటిల్ పాల్గొన్నారు.


ఇవి కూడా చదవండి...

వరదల వేళ చంద్రబాబు కీలక ఆదేశం.. మత్స్యకార కుటుంబాలకు 50 కేజీల బియ్యం

పిక్సెల్స్ అయినా.. పైప్స్ అయినా.. ప్రజల జీవనోపాధి బలోపేతమే లక్ష్యం: సీఎం చంద్రబాబు

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 26 , 2026 | 10:51 AM