Share News

జనసేనలో మరో సమన్వయ కమిటీ

ABN , Publish Date - Sep 26 , 2026 | 06:18 AM

రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక ప్రక్రియలో భాగంగా పార్టీకి చెందిన ఐదుగురు సభ్యులతో మరొక ప్రత్యేక సమన్వయ కమిటీని పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ నియమించారు.

జనసేనలో మరో సమన్వయ కమిటీ

  • కమిటీలో ఎమ్మెల్యే వంశీ, చిల్లపల్లి, దొరబాబు, భాస్కర్‌

అమరావతి, సెప్టెంబరు 25(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక ప్రక్రియలో భాగంగా పార్టీకి చెందిన ఐదుగురు సభ్యులతో మరొక ప్రత్యేక సమన్వయ కమిటీని పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ నియమించారు. ఈ కమిటీలో ఏపీఎంస్ఐడీసీ చైర్మన్‌ చిల్లపల్లి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, విశాఖపట్నం దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణయాదవ్‌, భీమవరం నియోజకవర్గానికి చెందిన నాయకులు పులవర్తి ప్రశాంత్‌, రైల్వేకోడూరు నుంచి యనమల భాస్కర్‌ సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ.. ఇప్పటికే పని చేస్తున్న 14 మంది సభ్యుల స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ సమన్వయ కమిటీతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ, క్షేత్రస్థాయి నుంచి అందే సమాచారాన్ని సేకరించి, రెండింటిని అధ్యయనం చేసి అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌కు నివేదించనున్నారు. ఆ నివేదికల ఆధారంగా పార్టీ అధ్యక్షుడు కమిటీ సభ్యుతో ప్రతి రోజూ సమీక్ష నిర్వహించి, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ నాయకులకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేయనున్నారు. కాగా, గతంలో నియమించిన 14 మంది సభ్యుల కమిటీలో కొన్ని మార్పులు చేయాలని పవన్‌ సూచించారు.

ఈ వార్తలనూ చదవండి..

ఎన్నికల్లో మోదీని ఎదుర్కోలేకే.. అసత్య ప్రచారాలు: రామ్ మాధవ్

హథీరాంజీ మఠం భూ లీజుదారులకు సుప్రీంలో ఎదురుదెబ్బ

Updated Date - Sep 26 , 2026 | 06:18 AM