కుడి ఎడమైతే..
ABN , Publish Date - Aug 13 , 2026 | 01:31 PM
కుడి ఎడమైతే పొరపాటులేదోయ్... అన్నాడు ఓ సినీ కవి. అందరూ కుడి చేతులతో పనులు చేస్తే కొందరు ఎడమచేతితో పనులు చేస్తుంటారు.
నేడు ఎడమచేతి వాటం దినోత్సవం..
కరీంనగర్: కుడి ఎడమైతే పొరపాటులేదోయ్... అన్నాడు ఓ సినీ కవి. అందరూ కుడి చేతులతో పనులు చేస్తే కొందరు ఎడమచేతితో పనులు చేస్తుంటారు. ఎడమచేతితో పనులు చేసేవారు నలుగురిలో ప్రత్యేకంగా కనిపిస్తారు. ఆగస్టు 13న అంతర్జాతీయ లెఫ్ట్ హ్యాండర్స్ డేని నిర్వహిస్తారు. తొలిసారి 1976 ఆగస్టు 13న నిర్వహించారు. ఈ సందర్భంగా ఎడమ చేతివాటం ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై,
ప్రపంచంలో అధికశాతంతో ఉన్న కుడిచేతివాటం ప్రజల కారణంగా ఏర్పడిన సాంకేతిక సమస్యలపై అవగాహన కల్పి స్తారు. ఎడమచేతివాటం ఉన్నవారు ఎక్కువ శాతం క్రీడలు, కళారంగాల్లో రాణిస్తారు. పాఠశాలలు, కళాశాలలతోపాటు కార్యాలయాల్లో చాలామంది ఎడమచేతితో పనులు చేయడం, రాయడం చూస్తుంటాం. ఈ ఎడమచేతివాటం వారికి ప్రత్యేక గుర్తింపు ఉంది.
చిన్నప్పటి నుంచి అలవాటు...
ఉజ్వల, హిందీ ఉపాధ్యాయిని
నాకు చిన్నప్పటి నుంచి ఎడమచేతితో రాయడం అలవాటు. ఇబ్బంది లేకుండా రాస్తాను. మా బాబు, పాప కూడా ఎడమ చేతితోనే రాస్తారు.
ఏం ఇబ్బందులు లేవు...
గజ్జెల సందీప్ 10వ, ప్రభుత్వ
ఉన్నత పాఠశాల సప్తగిరి కాలని ఎడమ చేతితో రాయడం వల్ల ఎలాంటి ఇబ్బందులు లేవు. ఎడమ చేతితోనే బాగా రాస్తాను. కుడి చేయితో రాయడం నా వల్ల కాదు. ప్రత్యేకంగా చూస్తారు..
ప్రత్యేకంగా చూస్తారు..
గొర్ల శ్రీహర్ష, ఛాత్రోపాధ్యాయురాలు, డైట్, కరీంనగర్
నేను ఎడమ చేతితో రాస్తుంటే అందరూ ప్రత్యే కంగా చూస్తారు. ఇది నాకు ఆనందంగా ఉంటుంది. నా ప్రత్యేకతకు నిదర్శనంగా భావిస్తాను.
ఈ వార్తలు కూడా చదవండి:
ప్రియాంక కుటుంబానికి రూ.20 లక్షల ఆర్థికసాయం
Read Latest AP News And Telangana News And International News And Telugu News