Share News

హైదరాబాద్‌‌లో మహిళ దారుణ హత్య..

ABN , Publish Date - Nov 12 , 2026 | 08:32 AM

హైదరాబాద్ నగరంలోని మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధి జిల్లెలగూడ దత్తునగర్‌లో మహిళ దారుణ హత్యకు గురైంది. తమిళనాడు రాష్ట్రానికి చెందిన అరుణ్ కుమార్, ఆయన భార్య (35) తమ కుటుంబంతో కలిసి దత్తునగర్‌లోని శ్రీ లక్ష్మీ రెసిడెన్సీ బ్లాక్-Aలో మూడో అంతస్తులో గత నాలుగేళ్లుగా అద్దెకు నివాసం ఉంటున్నారు.

హైదరాబాద్‌‌లో మహిళ దారుణ హత్య..
Hyderabad Woman Case

హైదరాబాద్, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): నగరంలోని మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధి జిల్లెలగూడ దత్తునగర్‌లో మహిళ దారుణ హత్యకు గురైంది. తమిళనాడు రాష్ట్రానికి చెందిన అరుణ్ కుమార్, ఆయన భార్య (35) తమ కుటుంబంతో కలిసి దత్తునగర్‌లోని శ్రీ లక్ష్మీ రెసిడెన్సీ బ్లాక్-Aలో మూడో అంతస్తులో గత నాలుగేళ్లుగా అద్దెకు నివాసం ఉంటున్నారు. అరుణ్ కుమార్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్నారు.


రక్తపు మడుగులో తన తల్లి పడి ఉండటాన్ని స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన పిల్లలు గమనించి వెంటనే తండ్రి అరుణ్ కుమార్‌కు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. దీంతో కుటుంబ సభ్యులు మహిళను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు తెలిసింది.


సమాచారం అందుకున్న మీర్‌పేట్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిసరాలను పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని మహిళ హత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.


ఈ వార్తలు కూడా చదవండి..

‘సర్’ పేరుతో మైనారిటీలు, దళితులు, పేదల ఓట్లను మోదీ సర్కార్ తొలగిస్తోంది: సీఎం రేవంత్‌రెడ్డి

మహబూబాబాద్ జిల్లాలో దారుణం.. ప్రేమ పేరుతో మైనర్‌కు వంచన

ప్రొబేషనరీ డీఎస్పీల ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 12 , 2026 | 08:53 AM