Share News

బండి సంజయ్ తల్లికి గుండెపోటు.. ఆస్పత్రికి తరలింపు..

ABN , Publish Date - May 15 , 2026 | 09:51 PM

కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ తల్లి శకుంతల గుండెపోటుకు గురయ్యారు. హుటాహుటిన కుటుంబ సభ్యులు ఆమెను హైదరాబాద్‌కు తరలించారు.

బండి సంజయ్ తల్లికి గుండెపోటు.. ఆస్పత్రికి తరలింపు..
Bandi Sanjay Mother

హైదరాబాద్, మే 15 (ఆంధ్రజ్యోతి): కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ తల్లి శకుంతల గుండెపోటుకు గురయ్యారు. హుటాహుటిన కుటుంబ సభ్యులు ఆమెను హైదరాబాద్‌కు తరలించారు. ప్రస్తుతం గచ్చిబౌలిలోని మెడికవర్ ఆస్పత్రిలో శకుంతల చికిత్స పొందుతున్నారు. బండి భగీరథ్ కేసులో సోషల్ మీడియాలో గత మూడు రోజులుగా జరుగుతున్న దుష్ప్రచారంపై తీవ్ర మనస్తాపానికి శకుంతల గురయ్యారు. ఆమెకు మెడికవర్ వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ఈ విషయం తెలియగానే మెడికవర్ ఆస్పత్రికి బండి సంజయ్ చేరుకుని.. తన అమ్మ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.


ఈ వార్తలు కూడా చదవండి...

రైతులను కేంద్ర ప్రభుత్వం మోసం చేస్తోంది: మంత్రి తుమ్మల

వరి, మొక్కజొన్న, జొన్న కొనుగోళ్లలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం విఫలం: మహేశ్వర్ రెడ్డి

ఫార్ములా ఈ కారు రేసు కేసులో కీలక పరిణామం.. కేటీఆర్ సహా ముగ్గురికి ఏసీబీ కోర్టు సమన్లు

Read Latest Telangana News And AP News And International News And Telugu News

Updated Date - May 15 , 2026 | 10:02 PM