హైదరాబాద్‌లో కుళ్లిన స్థితిలో మృతదేహం.. భయాందోళనలో ప్రజలు
ABN , Publish Date - Apr 09 , 2026 | 01:34 PM
ఉప్పల్ బీరప్పగడ్డ శ్మశాన వాటికలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం కావడం స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. ఈ మృతదేహం పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో ఉండటంతో ఆ ప్రాంతమంతా దుర్వాసన వస్తోంది.
హైదరాబాద్, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): ఉప్పల్ బీరప్పగడ్డ శ్మశాన వాటికలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం కావడం స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. ఈ మృతదేహం పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో ఉండటంతో ఆ ప్రాంతమంతా దుర్వాసన వస్తోంది. దీంతో తీవ్ర భయాందోళనకు గురైన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందిన వెంటనే ఉప్పల్ పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. మృతదేహం పడి ఉన్న తీరుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
క్లూస్ టీమ్ రంగంలోకి..
ఆధారాల సేకరణ కోసం పోలీసులు క్లూస్ టీమ్‌ను రప్పించారు. ఘటనా స్థలంలో వేలిముద్రలు, ఇతర సాక్ష్యాధారాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. మృతదేహం కుళ్లిపోయి ఉండటంతో, అది సహజ మరణమా?, లేక ఎవరైనా హత్య చేసి అక్కడ పడేశారా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ప్రాథమిక పంచనామా అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. పోస్టుమార్టం నివేదిక వస్తేనే మరణానికి గల అసలు కారణాలు తెలిసే అవకాశం ఉంది.
మృతుడి గుర్తింపు కోసం ప్రయత్నాలు..
మృతుడు ఎవరు?, ఎక్కడి నుంచి వచ్చారు? అనే విషయాలను తెలుసుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. చుట్టుపక్కల పోలీస్ స్టేషన్లలో నమోదైన మిస్సింగ్ కేసుల వివరాలపై ఆరా తీస్తున్నారు. శ్మశాన వాటిక పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీని కూడా పరిశీలిస్తున్నారు. ఉప్పల్ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు. మృతుడి గురించి ఎవరికైనా సమాచారం తెలిస్తే పోలీసులకు వెంటనే తెలియజేయాలని సూచించారు. ఈ ఘటనతో బీరప్పగడ్డ పరిసర ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
కాళేశ్వరంపై విచారణ.. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌పై తీర్పును వాయిదా వేసిన హైకోర్టు
రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఢిల్లీకి ఘోరమైన గులాంగిరి చేస్తోంది: కవిత
ఐఏఎస్‌లను బెదిరించి చీకటి జీవోలు తెచ్చారు.. కేసీఆర్‌పై ఎంపీ చామల ధ్వజం
Read Latest Telangana News And AP News And International News And Telugu News