Share News

సీఎం రేవంత్‌రెడ్డితో ఉబర్ సీఈవో భేటీ.. హైదరాబాద్‌లో విస్తరణపై చర్చ

ABN , Publish Date - May 13 , 2026 | 05:14 PM

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డితో జూబ్లీహిల్స్ నివాసంలో ఉబర్ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస‌ర్ దారా ఖోస్రోషాహి బుధవారం సమావేశం అయ్యారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు.

సీఎం రేవంత్‌రెడ్డితో ఉబర్ సీఈవో భేటీ.. హైదరాబాద్‌లో విస్తరణపై చర్చ
Telangana CM Revanth Reddy

హైదరాబాద్, మే 13 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డితో (Telangana CM Revanth Reddy) జూబ్లీహిల్స్ నివాసంలో ఉబర్ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస‌ర్ (CEO) దారా ఖోస్రోషాహి ఈరోజు (బుధవారం) సమావేశం అయ్యారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ స‌మావేశంలో ఉబర్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ (CBO) మధు కన్నన్, ఉబర్ ఇండియా, సౌత్ ఆసియా ప్రెసిడెంట్ ప్రభ్‌జీత్ సింగ్, చీఫ్ టెక్నాల‌జీ ఆఫీస‌ర్ ప్ర‌వీణ్ నిప్పల్లి నాగ, సీఎం ప్ర‌త్యేక కార్య‌ద‌ర్శి అజిత్ రెడ్డి పాల్గొన్నారు. ఉబర్ విస్త‌ర‌ణ‌కు రాష్ట్ర ప్ర‌భుత్వంతో క‌లిసి ముందుకు సాగుతామ‌ని సీఈవో ఖోస్రోషాహి స్పష్టం చేశారు.


హైద‌రాబాద్‌లో ఉబర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను విస్త‌రిస్తున్న‌ట్లు సీఎం రేవంత్‌రెడ్డికి ఉబర్ సీఈవో తెలిపారు. అమెరికా వెలుప‌ల ఏర్పాటు చేసిన ఈ మొద‌టి సెంట‌ర్‌‌లో 600 మంది ఇంజ‌నీర్లు పనిచేస్తున్నార‌ని సీఈవో వివ‌రించారు. భార‌త్ ఫ్యూచ‌ర్ సీటీలో ఉబర్ కార్పొరేట్ ఆఫీస్ నిర్మాణానికి ఆస‌క్తి చూపించారు. పార్కింగ్ వ్యాపారంలోకి వ‌చ్చే అంశాన్ని ప‌రిశీలించాల‌ని ఉబర్ సీఈవో‌కి సూచించారు ముఖ్య‌మంత్రి. దేశంలోని ప్ర‌ముఖ న‌గ‌రాల్లో పార్కింగ్ స‌మ‌స్య‌ను ఉబర్ ప్ర‌తినిధుల దృష్టికి తీసుకువ‌చ్చారు సీఎం. భ‌విష్య‌త్తు అవ‌స‌రాల దృష్ట్యా మ‌ల్టీ లెవ‌ల్ పార్కింగ్ సెంట‌ర్లు ఏర్పాటు చేస్తే బాగుంటుంద‌ని సూచించారు. సీఎం సూచ‌నపైన స‌మ‌గ్ర అధ్య‌య‌నం చేస్తామ‌ని ఉబర్ ప్ర‌తినిధులు తెలిపారు. వ్యాపార విస్త‌ర‌ణ‌కు అన్నివిధాలుగా రాష్ట్ర ప్ర‌భుత్వం స‌హ‌క‌రిస్తుంద‌ని ఉబర్ ప్ర‌తినిధుల‌కు సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు.


ఈ వార్తలు కూడా చదవండి...

బండి భగీరథ్‌ పోక్సో కేసులో మరో కీలక పరిణామం

మంత్రి పొన్నం వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదు: మహేశ్ గౌడ్

రైల్ రోకో కేసులో కవితకు సమన్లు..

Read Latest Telangana News And AP News And International News And Telugu News

Updated Date - May 13 , 2026 | 05:46 PM