Share News

ఆర్టీసీలో సమ్మె సైరన్‌..

ABN , Publish Date - Apr 22 , 2026 | 06:47 AM

ఆర్టీసీ జేఏసీ బంద్‌ ప్రకటనతో గ్రేటర్‌లోని బస్సులు డిపోలకే పరిమితం కానున్నాయి.

ఆర్టీసీలో సమ్మె సైరన్‌..
TGSRTC

  • టీజీఎస్ఆర్టీసీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు

  • జేఏసీ బంద్‌ ప్రకటనతో డిపోల్లోనే బస్సులు

  • ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందితో నడిపించే యోచనలో అధికారులు

హైదరాబాద్‌ సిటీ: ఆర్టీసీ జేఏసీ బంద్‌ ప్రకటనతో గ్రేటర్‌లోని బస్సులు డిపోలకే పరిమితం కానున్నాయి. నిత్యం ఆఫీసులకు, రోజువారీ పనుల నిమిత్తం ఆర్టీసీపై ఆధారపడే లక్షల మందికి ఇబ్బందులు ఎదురుకానున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్టీసీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది.

గ్రేటర్‌ జోన్‌లో 3,200 సిటీ బస్సులు

గ్రేటర్‌ జోన్‌ ఆర్టీసీ 3,200 బస్సులు నడుపుతూ రోజూ 23 లక్షల మంది ప్రయాణికులకు సేవలందిస్తోంది. కార్మికుల సమ్మెతో బస్సులన్నీ బుధవారం డిపోలకే పరిమితమవుతాయని జేఏసీ నేతలు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు. అద్దె సర్వీసులతో పాటు ఎలక్ర్టిక్‌ బస్సులు నడిపేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామన్నారు. గ్రేటర్‌లో 440 ఎలక్ర్టిక్‌ బస్సులు, 250 అద్దె బస్సులతో పాటు మరిన్ని బస్సులు ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బందితో నడిపే దిశగా ఆర్టీసీ చర్యలు చేపట్టింది.


city1.2.jpgజిల్లాలకు వెళ్లే ప్రయాణికులపై ఎఫెక్ట్‌

నగరం నుంచి తెలంగాణలోని పలు జిల్లాలకు వెళ్లే బస్సులు మంగళవారం అర్ధరాత్రి నుంచి బంద్‌ కానున్నాయి. సమ్మెతో జిల్లాలకు వెళ్లే ప్రయాణికులు బస్టాండ్లకు రాకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో గమ్యస్థానాలకు చేరుకునే అవకాశాలు చూసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. రైల్వే స్టేషన్లు, ఇతర ప్రాంతాలకు బస్సుల్లో వెళ్లే ప్రయాణికులు ఆర్టీసీ బంద్‌తో గంట, రెండు గంటల ముందే గమ్యస్థానాలకు చేరుకునేలా ప్లాన్‌ చేసుకోవాలని పేర్కొంటున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

తెలంగాణ నుంచి 8 కొత్త రైళ్లు

అల్లు అర్జున్‌కు ఊరట.. ఢిల్లీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

Read Latest Telangana News and National News

Updated Date - Apr 22 , 2026 | 06:47 AM