నందిగం సురేశ్‌కు నోటీసులివ్వండి
ABN , Publish Date - Apr 22 , 2026 | 06:05 AM
పాతిక లక్షల రూపాయలు తీసుకొని మోసం చేశారనే ఆరోపణలతో నమోదైన కేసులో వైపీసీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌కు బీఎన్‌ఎ్‌సఎస్ సెక్షన్ 35(3) ప్రకారం నోటీసులిచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది.
మోసం కేసులో పోలీసులకు హైకోర్టు ఆదేశం
అమరావతి, ఏప్రిల్ 21(ఆంధ్రజ్యోతి): పాతిక లక్షల రూపాయలు తీసుకొని మోసం చేశారనే ఆరోపణలతో నమోదైన కేసులో వైపీసీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌కు బీఎన్‌ఎ్‌సఎస్ సెక్షన్ 35(3) ప్రకారం నోటీసులిచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. వ్యాజ్యాన్ని పరిష్కరించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి మంగళవారం ఉత్తర్వులు ఇచ్చారు. కాకినాడ సీబీసీఎన్‌సీ చర్చికి చెందిన ట్రస్ట్ రెన్యువల్ చేయిస్తానని రూ.25 లక్షలు తీసుకొని మోసం చేశారని షేక్ మౌలాలి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా తుళ్లూరు పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ నందిగం సురేశ్ హైకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యం మంగళవారం విచారణకు రాగా సురేశ్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ... పిటిషనర్‌పై పోలీసులు నమోదు చేసిన సెక్షన్లు అన్నీ ఏడేళ్లలోపు శిక్షకు వీలున్నవేనన్నారు. ఏపీపీ ప్రియాంక వాదనలు వినిపిస్తూ... పిటిషనర్‌కు పూర్వ నేరచరిత్ర ఉందని, 9కేసులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. ఇరువైపుల వాదనలు పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి పిటిషనర్‌కు నోటీసులిచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు.