Share News

ప్రోత్సాహమేది సారూ?

ABN , Publish Date - Apr 22 , 2026 | 06:12 AM

తమ సేవలను పొందుతూ, రెండేళ్లుగా రావాల్సిన ప్రోత్సాహకాలను మాత్రం స్త్రీనిధి సంస్థ విడుదల చేయడం లేదని సెర్ప్‌ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రోత్సాహమేది సారూ?

  • సెర్ప్‌ సిబ్బందికి రెండేళ్లుగా పెండింగ్‌లో ప్రోత్సాహకాలు

అమరావతి, ఏప్రిల్‌ 21 (ఆంధ్రజ్యోతి): తమ సేవలను పొందుతూ, రెండేళ్లుగా రావాల్సిన ప్రోత్సాహకాలను మాత్రం స్త్రీనిధి సంస్థ విడుదల చేయడం లేదని సెర్ప్‌ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సెర్ప్‌తో నేరుగా సంబంధం లేకపోయినా స్త్రీనిధి మేనేజ్‌మెంట్‌ తమకు లక్ష్యాలను నిర్దేశించి పనులు చేయిస్తోందని చెబుతున్నారు. ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ప్రోత్సాహకాల విషయం స్త్రీనిధి మేనేజ్‌మెంట్‌ పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. గత రెండేళ్లుగా 20 వేల మంది సెర్ప్‌ సిబ్బంది స్త్రీనిధి సేవలో ఉన్నారు. అప్పటినుంచి తమకు ఏడాదికి రూ.7 వేల నుంచి రూ.15 వేలు చొప్పున రావాల్సి ఉన్నదని వాదిస్తున్నారు. మంత్రి, సెర్ప్‌ సీఈవో ఈ విషయంపై దృష్టి సారించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

Updated Date - Apr 22 , 2026 | 06:12 AM