Share News

శబరిమలకు టీజీఎస్‌ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

ABN , Publish Date - Nov 05 , 2026 | 09:15 AM

శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లే భక్తుల సౌకర్యార్థం టీజీఎస్‌ ఆర్టీసీ రంగారెడ్డి రీజియన్‌ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు రీజినల్‌ మేనేజర్‌ వి.శ్రీదేవి తెలిపారు.

శబరిమలకు టీజీఎస్‌ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
Sabarimala Special Buses

  • గురుస్వాములకు, భక్తులకు ప్రత్యేక రాయితీలు

హైదరాబాద్: శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లే భక్తుల సౌకర్యార్థం టీజీఎస్‌ ఆర్టీసీ రంగారెడ్డి రీజియన్‌ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు రీజినల్‌ మేనేజర్‌ వి.శ్రీదేవి తెలిపారు. అయ్యప్ప స్వాముల యాత్ర సురక్షితంగా, సౌకర్యవంతంగా సాగేందుకు ఈ బస్సులను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ఆమె వివరించారు. ఈ నెల 16వ తేదీ నుంచి డిసెంబరు 27వ తేదీ వరకు మండల పూజకు వెళ్లే భక్తుల కోసం, అలాగే డిసెంబరు 30వ తేదీ నుంచి నూతన సంవత్సరం జనవరి 20వ తేదీ వరకు ప్రత్యేక బస్సులను నడపడానికి ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.


city5.2.jpgగురుస్వాములకు, భక్తులకు ప్రత్యేక రాయితీలు

ఆర్టీసీ బస్సు బుక్‌ చేసే గురుస్వామికి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నారు. ఒకటి కంటే ఎక్కువ బస్సులను బుక్‌ చేసిన గురుస్వామికి ఒక బస్సులో ఉచిత ప్రయాణంతోపాటు, మిగిలిన బస్సుల్లో ఒక్కో బస్సుకు రోజుకు రూ.350 చొప్పున కమిషన్‌ చెల్లించనున్నారు. ప్రతీ బస్సులో ఇద్దరు వంట వారికి, 10 సంవత్సరాలలోపు ఇద్దరు మణికంఠలకు, ఒక లగేజీ అటెండెంట్‌కు సీట్లు కేటాయించకుండా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించనున్నారు. మరిన్ని వివరాల కోసం 040-66440000, 040-23450033లో సంప్రదించవచ్చు.


ఈ వార్తలు కూడా చదవండి:

భారీగా పెరిగిన బంగారం ధర

గురుకుల ఉద్యోగుల పెండింగ్‌ జీతాలు చెల్లించాలి

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Nov 05 , 2026 | 09:15 AM