‘పేస్’తో కొట్టారు
ABN , Publish Date - Nov 05 , 2026 | 04:38 AM
న్యూజిలాండ్‌తో ఐదు వన్డేల సిరీస్‌లో టీమిండియాకు అదిరే ఆరంభం. బలహీనంగా ఉందని విమర్శలపాలైన మన బౌలింగ్ దళమే ఆతిథ్య కివీస్ బ్యాటర్లను...
అర్ష్‌దీప్‌నకు నాలుగు, బ్రార్‌కు మూడు వికెట్లు
కట్టడి చేసిన కాంబోజ్
చెలరేగిన విరాట్ కోహ్లీ
తొలి వన్డేలో కివీస్‌పై భారత్ ఘన విజయం
ఆక్లాండ్: న్యూజిలాండ్‌తో ఐదు వన్డేల సిరీస్‌లో టీమిండియాకు అదిరే ఆరంభం. బలహీనంగా ఉందని విమర్శలపాలైన మన బౌలింగ్ దళమే ఆతిథ్య కివీస్ బ్యాటర్లను బెంబేలెత్తించింది. కెరీర్‌లో రెండో వన్డే ఆడిన పేసర్ అన్షుల్ కాంబోజ్ (10-2-22-2) మధ్య ఓవర్లలో పొదుపైన బౌలింగ్‌తో కట్టడి చేశాడు. అటు మరో పేసర్ అర్ష్‌దీప్ సింగ్ నాలుగు వికెట్లతో చెలరేగగా, ఆరున్నర అడుగుల పొడగరి గుర్నూర్ బ్రార్ (3/44) బౌన్సీ బంతులతో ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేశాడు. ఇక ఛేజింగ్‌లో రారాజు విరాట్ కోహ్లీ (51 బంతుల్లో 13 ఫోర్లు, ఓ సిక్స్‌తో 74) సూపర్ ఇన్నింగ్స్‌తో సత్తా చాటాడు. దీంతో బుధవారం ఈడెన్ పార్క్‌లో జరిగిన తొలి వన్డేలో భారత్ డక్‌వర్త్ లూయిస్ పద్దతిన 5 వికెట్ల తేడాతో గెలిచి సిరీస్‌లో 1-0తో ముందంజ వేసింది. వర్షం కారణంగా ఈ మ్యాచ్ కాస్త ఆలస్యంగా ఆరంభమైంది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 40.2 ఓవర్లలో 185 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్ టిమ్ సైఫర్ట్ (38), బ్లెయిర్ టిక్నెర్ (34), గ్లెన్ ఫిలిప్స్ (30), డారిల్ మిచెల్ (28) రాణించారు. ఛేదనలో భారత్‌కు రెండుసార్లు వర్షం ఆటంక పరిచింది. దీంతో మొదట లక్ష్యాన్ని అంపైర్లు 40 ఓవర్లలో 167 పరుగులకు కుదించారు. ఆ తర్వాత మరోసారి వర్షం కురవడంతో.. ఈసారి లక్ష్యాన్ని 32 ఓవర్లలో 143 రన్స్‌కు కుదించారు. ఇక, ఈ టార్గెట్‌ను భారత్ 22.4 ఓవర్లలోనే 143/5 స్కోరుతో పూర్తి చేసి గెలిచింది. కెప్టెన్ గిల్ (37) ఫర్వాలేదనిపించాడు. డఫీకి 3 వికెట్లు దక్కాయి. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా అన్షుల్ కాంబోజ్ నిలిచాడు.
విరాట్ జోరు: స్వల్ప ఛేదనలో భారత్ తొలి ఓవర్‌లోనే రోహిత్ (0) వికెట్ కోల్పోయింది. అయితే గిల్-విరాట్ జోడీ మాత్రం కివీస్ బౌలర్లకు అవకాశం ఇవ్వలేదు. అయితే 11వ ఓవర్‌లో గంటపాటు వర్షం కురవడంతో లక్ష్యాన్ని సవరించారు. ఆ తర్వాత ఏడు బంతుల మ్యాచ్ కాగానే, మరో అర్ధగంటపాటు వర్షం అంతరాయం ఏర్పడింది. దీంతో మ్యాచ్‌ను 32 ఓవర్లకు తగ్గించారు. అనంతరం కోహ్లీ బౌండరీలతో చెలరేగడంతో 35 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తి చేశాడు. అయితే రెండో వికెట్‌కు 113 పరుగులు జోడించాక గిల్ వెనుదిరిగాడు. ఇక 20వ ఓవర్‌లో కోహ్లీ, అక్షర్ (0)లను, 22వ ఓవర్‌లో శ్రేయాస్ అయ్యర్ (15)ను డఫీ అవుట్ చేసినా, అప్పటికే భారత్ విజయానికి ఢోకాలేకపోయింది. నమన్ ధిర్ (5 నాటౌట్) ఫోర్‌తో 56 బంతులుండగానే మ్యాచ్ ముగిసింది.
యువ పేసర్ల సత్తా: టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కివీస్ ఇన్నింగ్స్‌లో పరుగులను నియంత్రించడంలో భారత్ అనుభవలేమి పేసర్లు సఫలమయ్యారు. ముఖ్యంగా కెప్టెన్ గిల్ నమ్మకాన్ని నిలబెట్టుకున్న బ్రార్.. కొత్త బంతితో చక్కటి బౌన్స్‌ను రాబట్టాడు. అతడికి జతగా అర్ష్‌దీప్, కాంబోజ్ మూకుమ్మడిగా దాడికి దిగడంతో కివీస్ కుదేలైంది. అయితే చివరి వికెట్‌కు డఫీ (15 నాటౌట్)తో కలిసి టిక్నెర్ అత్యధికంగా 39 రన్స్ అందించడంతో కివీస్ గౌరవప్రదమైన స్కోరందుకుంది. ముందుగా యంగ్ (9), నికోల్స్ (9)లను అర్ష్‌దీప్ అవుట్ చేయగా.. మూడో వికెట్‌కు సైఫర్ట్, మిచెల్ 33 రన్స్ జోడించారు. మిడిలార్డర్‌లో ఫిలిప్స్ కాసేపు క్రీజులో నిలిచినా ధాటిగా ఆడలేకపోయాడు. 146/9 స్కోరు దగ్గర చివరి బ్యాటర్ టిక్నెర్ 4 సిక్సర్లతో ధాటిగా ఆడాడు. బ్రార్ అతడిని అవుట్ చేయడంతో 41వ ఓవర్‌లోనే కివీస్ ఆట ముగిసింది.
స్కోరుబోర్డు
న్యూజిలాండ్: యంగ్ (సి) శ్రేయాస్ (బి) అర్ష్‌దీప్ 9, సైఫర్ట్ (సి సబ్) రుతురాజ్ (బి) బ్రార్ 38, నికోల్స్ (సి) నమన్ (బి) అర్ష్‌దీప్ 9, మిచెల్ (రనౌట్) 28, లాథమ్ (సి అండ్ బి) బ్రార్ 3, ఫిలిప్స్ (సి) శ్రేయాస్ (బి) అర్ష్‌దీప్ 30, శాంట్నర్ (బి) కాంబోజ్ 4, స్మిత్ (సి) విరాట్ (బి) కాంబోజ్ 1, జేమిసన్ (సి) విరాట్ (బి) అర్ష్‌దీప్ 1, డఫీ (నాటౌట్) 15, టిక్నెర్ (సి) రాహుల్ (బి) బ్రార్ 34; ఎక్స్‌ట్రాలు: 13; మొత్తం: 40.2 ఓవర్లలో 185 ఆలౌట్. వికెట్ల పతనం: 1-22, 2-40, 3-73, 4-84, 5-97, 6-113, 7-115, 8-131, 9-146, 10-185. బౌలింగ్: అర్ష్‌దీప్ 10-0-70-4, నబీ 6-0-33-0, కాంబోజ్ 10-2-22-2, బ్రార్ 9.2-0-44-3, అక్షర్ 5-0-12-0.
భారత్: రోహిత్ (సి) శాంట్నర్ (బి) జేమిసన్ 0, గిల్ (సి) లాథమ్ (బి) స్మిత్ 37, విరాట్ (సి) సైఫర్ట్ (బి) డఫీ 74, శ్రేయాస్ (సి) నికోల్స్ (బి) డఫీ 15, అక్షర్ (సి) ఫిలిప్స్ (బి) డఫీ 0, రాహుల్ (నాటౌట్) 3, నమన్ (నాటౌట్) 5; ఎక్స్‌ట్రాలు: 9; మొత్తం: 22.4 ఓవర్లలో 143/5. వికెట్ల పతనం: 1-1, 2-114, 3-124, 4-124, 5-136. బౌలింగ్: జేమిసన్ 7-0-34-1, డఫీ 7-0-49-3, టిక్నెర్ 4-0-38-0, స్మిత్ 4.4-0-21-1.
1
వన్డే ఫార్మాట్ ఛేదనలో ఎక్కువ పరుగులు (8,741) చేసిన బ్యాటర్‌గా విరాట్ కోహ్లీ. ఈ జాబితాలో సచిన్ (8,720)ను దాటేశాడు. మూడో నెంబర్‌లో 13వేల రన్స్ పూర్తి చేసుకున్న తొలి బ్యాటర్ కూడా కోహ్లీనే. అలాగే న్యూజిలాండ్‌పై అత్యధిక రన్స్ (1,971) చేసిన వన్డే బ్యాటర్‌గా పాంటింగ్‌తో సమంగా నిలిచాడు.

వయస్సు పెరిగినా.. రోహిత్ సూపర్ త్రో..
వెటరన్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్‌లో అద్భుత ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్నారు. కివీస్ ఇన్నింగ్స్ 21వ ఓవర్‌లో మిడ్ వికెట్ నుంచి అండర్ ఆర్మ్ త్రో ద్వారా రోహిత్ మెరుపు వేగంతో విసిరిన బంతి నేరుగా వికెట్లను తాకడంతో స్టేడియం హోరెత్తింది. దీంతో కీలక బ్యాటర్ మిచెల్ రనౌట్‌గా వెనుదిరిగాడు. ఇక.. 29వ ఓవర్‌లో నాథన్ స్మిత్ ఇచ్చిన క్యాచ్ స్లిప్‌లో అత్యంత తక్కువ ఎత్తులో వచ్చినప్పటికీ డైవ్ చేసి మరీ విరాట్ పట్టేయడం ఫ్యాన్స్‌ను జోష్‌లో నింపింది.
ఇవి కూడా చదవండి..
అమెరికా మిడ్‌టర్మ్ ఫలితాలపై కమలా హారిస్ స్పందన.. 'హల్లెలూయ' వీడియో వైరల్..
అమెరికా కాంగ్రెస్‌పై డెమోక్రాట్ల పట్టు.. భారత్ పరిస్థితేంటి..