Share News

అమెరికా మిడ్‌టర్మ్ ఫలితాలపై కమలా హారిస్ స్పందన.. 'హల్లెలూయ' వీడియో వైరల్..

ABN , Publish Date - Nov 04 , 2026 | 03:18 PM

అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రాట్‌లు విజయం సాధించి కాంగ్రెస్‌లోని రెండు సభలపై పట్టు సాధించారు. దీంతో మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ఆనందం వ్యక్తం చేశారు. కేవలం నాలుగు సెకన్ల నిడివి ఉన్న 'హల్లెలూయా' వీడియోను ఆమె సోషల్ మీడియా 'ఎక్స్‌'లో పోస్ట్ చేశారు.

అమెరికా మిడ్‌టర్మ్ ఫలితాలపై కమలా హారిస్ స్పందన.. 'హల్లెలూయ' వీడియో వైరల్..
Kamala Harris Viral Video

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రాట్‌లు విజయం సాధించి కాంగ్రెస్‌లోని రెండు సభలపై పట్టు సాధించారు. దీంతో మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ఆనందం వ్యక్తం చేశారు. కేవలం నాలుగు సెకన్ల నిడివి ఉన్న 'హల్లెలూయా' వీడియోను ఆమె సోషల్ మీడియా 'ఎక్స్‌'లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ చిన్న వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. డెమోక్రాట్‌లు ప్రతినిధుల సభతో పాటు సెనేట్‌లోనూ ఆధిపత్యం సాధించిన నేపథ్యంలో కమలా హారిస్ తన ఆనందాన్ని నాలుగు సెకన్ల వీడియో రూపంలో పంచుకున్నారు (Kamala Harris Viral Video).


ఆ వీడియోలో ఆమె 'హల్లెలూయా' అంటూ సంతోషంగా స్పందించారు. డెమోక్రాట్‌లు చారిత్రాత్మక విజయంతో ప్రతినిధుల సభ, సెనేట్ రెండింటినీ తిరిగి కైవసం చేసుకోనున్నారని పేర్కొన్న పోస్టుతో ఈ వీడియోను జత చేశారు. జార్జియా రాష్ట్రానికి చెందిన సెనేటర్ జాన్ ఓసాఫ్ గెలవడంతో నిర్వహించిన కార్యక్రమంలో కమలా హారిస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తీసిన వీడియోను ఆమె 'ఎక్స్‌'లో పంచుకోవడంతో అది వైరల్‌గా మారింది (Hallelujah Video).


మధ్యంతర ఎన్నికలకు ముందు కమలా హారిస్ డెమోక్రాట్‌ల అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు (US Midterm Elections 2026). సెప్టెంబర్ నుంచి పార్టీ నాయకులతో కలిసి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. యువ ఓటర్లను ఆకర్షించేందుకు ఆమె మళ్లీ సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యారు. డెమోక్రాట్‌ల తాజా విజయంతో అమెరికా రాజకీయాల్లో కొత్త పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. ట్రంప్ ప్రభుత్వ విధానాలపై కాంగ్రెస్‌లో డెమోక్రాట్‌లకు ప్రశ్నించే అవకాశం పెరగనుంది.


ఈ వార్తలు కూడా చదవండి..

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో అన్ని స్థానాలే లక్ష్యం.. సీఎం చంద్రబాబు దిశానిర్దేశం

ఏపీ పుర పోరులో కూటమి గెలుపు హోరు

Updated Date - Nov 04 , 2026 | 03:18 PM