అమెరికా కాంగ్రెస్‌పై డెమోక్రాట్ల పట్టు.. భారత్ పరిస్థితేంటి..
ABN , Publish Date - Nov 04 , 2026 | 02:25 PM
అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రాట్లు చరిత్రాత్మక విజయం సాధించారు. ప్రతినిధుల సభ, సెనేట్ రెండింటిపైనా ఆధిపత్యం సాధించారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దీంతో అమెరికా రాజకీయాల్లో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రాట్లు చరిత్రాత్మక విజయం సాధించారు. ప్రతినిధుల సభ, సెనేట్ రెండింటిపైనా ఆధిపత్యం సాధించారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దీంతో అమెరికా రాజకీయాల్లో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఈ పరిణామాలు భారత్‌పైనా ప్రభావం చూపే అవకాశం ఉండటంతో మనదేశంలో కూడా ఆసక్తి నెలకొంది. సెనేట్‌లో ఐదు స్థానాలను తమ ఖాతాలో వేసుకోవడంతో పాటు ప్రతినిధుల సభలోనూ డెమోక్రాట్లు పలు స్థానాలను గెలుచుకున్నారు (Democrats US Congress Victory).
కాంగ్రెస్‌లోని రెండు సభలపైనా డెమోక్రాట్లు పట్టు సాధించారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం, దిగుమతి సుంకాల విధానాలు, ఇరాన్‌తో యుద్ధం కారణంగా ఇంధన ధరలు ఎగబాకడం వంటి అంశాలు రిపబ్లికన్లకు ప్రతికూలంగా మారాయి. అమెరికా కాంగ్రెస్‌లో డెమోక్రాట్ల బలం పెరగడం భారత్‌కు కూడా కీలక పరిణామమే. అమెరికా తీసుకునే వాణిజ్య, వలస, రక్షణ సంబంధిత నిర్ణయాలు భారత ఆర్థిక వ్యవస్థతో పాటు అక్కడ పనిచేస్తున్న భారతీయులపైనా ప్రభావం చూపుతాయి. అయితే కాంగ్రెస్‌లో మెజారిటీ వచ్చినంత మాత్రాన అమెరికా విదేశాంగ విధానం పూర్తిగా మారిపోదు (India US Relations).
భారత్‌కు అమెరికా అతిపెద్ద ఎగుమతి మార్కెట్లలో ఒకటి. ముఖ్యంగా వస్త్రాలు, ఔషధాలు, ఇంజినీరింగ్ ఉత్పత్తులు, తయారీ రంగాలపై అమెరికా దిగుమతి సుంకాల ప్రభావం ఉంటుంది. డెమోక్రాట్ల ఆధిపత్యంతో ట్రంప్ వాణిజ్య విధానాలపై కాంగ్రెస్‌లో మరింత చర్చ, పరిశీలన జరిగే అవకాశం ఉంది. అయితే సుంకాలు వెంటనే తగ్గుతాయని ఆశించలేం. భారత్‌తో పూర్తిస్థాయి వాణిజ్య ఒప్పందం కుదరడానికి మరికొంత సమయం పట్టవచ్చు. అలాగే భారత్, అమెరికా మధ్య రక్షణ రంగంలో సహకారం గత కొన్నేళ్లుగా పెరుగుతోంది. కాంగ్రెస్‌లో డెమోక్రాట్ల ఆధిపత్యం కారణంగా భారత్‌తో సంబంధాలు, ప్రాంతీయ భద్రత, రక్షణ ఒప్పందాలపై అమెరికా చట్టసభల్లో చర్చలు పెరిగే అవకాశం ఉంది (India US Trade Deal).
అమెరికాలో పనిచేస్తున్న లక్షలాది మంది భారతీయ నిపుణులకు హెచ్-1బీ వీసాలు (H1B Visa) ఎంతో కీలకం. ముఖ్యంగా భారతీయ ఐటీ ఉద్యోగులు, సాంకేతిక నిపుణులపై ఈ వీసా కార్యక్రమంలో వచ్చే మార్పులు ప్రభావం చూపుతాయి. ట్రంప్ ప్రభుత్వం కొత్త హెచ్-1బీ దరఖాస్తులపై లక్ష డాలర్ల రుసుమును ప్రకటించింది. డెమోక్రాట్లు కాంగ్రెస్‌లో బలం పెంచుకోవడంతో వలస విధానాలపై మరింత చర్చ జరిగే అవకాశం ఉంది. అయితే ఈ ఎన్నికల ఫలితాలతోనే వీసా నిబంధనల్లో గణనీయమైన మార్పులు రావు. కానీ, కొన్ని కఠినమైన ప్రతిపాదనలకు అడ్డుకట్ట పడవచ్చు.
ఈ వార్తలు కూడా చదవండి..
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో అన్ని స్థానాలే లక్ష్యం.. సీఎం చంద్రబాబు దిశానిర్దేశం
ఏపీ పుర పోరులో కూటమి గెలుపు హోరు