మత్తు మందుల అక్రమ విక్రయాలపై టీజీ సేఫ్ కొరడా
ABN , Publish Date - Oct 24 , 2026 | 07:40 PM
తెలంగాణలో మత్తు మందుల అక్రమ విక్రయాలపై టీజీ సేఫ్ కొరడా ఝళిపించింది. హైదరాబాద్ క్యూర్ పరిధిలో పలు ప్రాంతాల్లో మెడికల్ షాపులపై అధికారులు శనివారం మెరుపు దాడులు నిర్వహించారు.
హైదరాబాద్, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో మత్తు మందుల అక్రమ విక్రయాలపై టీజీ సేఫ్ కొరడా ఝళిపించింది. హైదరాబాద్ క్యూర్ (CURE) పరిధిలో పలు ప్రాంతాల్లో మెడికల్ షాపులపై అధికారులు ఈరోజు (శనివారం) మెరుపు దాడులు నిర్వహించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ పోలీసులతో కలిసి డ్రగ్స్ వింగ్ అధికారులు తనిఖీలు చేపట్టారు. గాజులరామారం, కుత్బుల్లాపూర్, మల్కాజిగిరి, కాప్రా, హబ్సిగూడ, ఉప్పల్‌లో సోదాలు చేశారు. జీడిమెట్ల, బాలానగర్, మేడిపల్లి, షామీర్‌పేట్ జోన్లలోనూ రైడ్స్ నిర్వహించారు.
ఈ నేపథ్యంలో హానికరమైన మాత్రల విక్రయాలపై అధికారులు నిఘాపెట్టారు. పలు రకాల మందులపై తనిఖీలు చేపట్టారు. ఆయా మందుల అక్రమ విక్రయాలపై ఆరా తీశారు. ఈ సోదాల్లో నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడిన 125 మెడికల్ షాపులను అధికారులు గుర్తించారు. సంబంధిత మెడికల్ షాపులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. లైసెన్సుల సస్పెన్షన్ లేదా రద్దుకు శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తెలంగాణలోని ఇతర జిల్లాల్లోనూ ప్రత్యేక తనిఖీలు కొనసాగుతున్నాయని అధికారులు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పోలీస్ శాఖలో అనేక సంస్కరణలు తెచ్చాం: సీఎం రేవంత్‌రెడ్డి
తెలంగాణ అభివృద్ధిలో ఎస్పీఎఫ్ పాత్ర కీలకం: భట్టి విక్రమార్క
క్యూర్ పరిధిలో లక్ష ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణమే లక్ష్యం: మంత్రి పొంగులేటి
Read Latest Telangana News And AP News And National News
And Telugu News