Share News

బీసీ, ఈబీసీ విద్యార్థులకు విదేశీ విద్య కోసం మరో అవకాశం

ABN , Publish Date - Oct 14 , 2026 | 04:20 PM

తెలంగాణలో బీసీ, ఈబీసీ విద్యార్థులకు విదేశీ విద్య కోసం ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. మహాత్మా జ్యోతిబా ఫూలే ఓవర్సీస్ విద్యానిధి పథకం కింద దరఖాస్తు చేసుకునే గడువును పొడిగించింది.

బీసీ, ఈబీసీ విద్యార్థులకు విదేశీ విద్య కోసం మరో అవకాశం
Telangana Overseas Scholarship

హైదరాబాద్, అక్టోబర్ 14: రాష్ట్రంలో బీసీ, ఈబీసీ విద్యార్థులకు విదేశీ విద్య కోసం ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే బీసీ, ఈబీసీ విద్యార్థులకు మహాత్మా జ్యోతిబా ఫూలే ఓవర్సీస్ విద్యానిధి పథకం కింద దరఖాస్తు చేసుకునే గడువును పొడిగించింది. అక్టోబర్ 15 నుంచి అక్టోబర్ 31 వరకు దరాఖస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. 2026 ఫాల్ సెషన్‌లో విదేశాల్లో చదవాలనుకునే అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.


ఈ పథకం ద్వారా విదేశాల్లో మాస్టర్స్, డాక్టోరల్ కోర్సుల కోసం విద్యార్థులకు ఆర్థిక సహాయాన్ని అందించనున్నారు. ఇందుకోసం దరఖాస్తుదారుల కుటుంబ వార్షిక ఆదాయం రూ.5 లక్షలలోపు ఉండాలి. దరఖాస్తుదారుల వయస్సు 35 ఏళ్లకు మించకూడదు. గ్రాడ్యుయేషన్‌లో కనీసం 60 శాతం మార్కులు తప్పనిసరి. విదేశీ విద్యకు దరఖాస్తు చేసుకునే విద్యార్థులు GREలో 260 లేదా GMATలో 550 స్కోర్ సాధించి ఉండాలి. అలాగే TOEFL 60 లేదా IELTS 6.0 లేదా PTE 50 స్కోర్ కలిగి ఉండాలి. అర్హులైన విద్యార్థులు నిర్ణీత గడువులోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులకు అక్టోబర్ 31, 2026 చివరి తేదీగా నిర్ణయించారు.


ఇవి కూడా చదవండి...

ఏపీ స్థానిక ఎన్నికలు.. సీట్ల సర్దుబాటుపై తుది చర్చల్లో కూటమి నేతలు

బీఆర్ఎస్ హయాంలో రూ.8 లక్షల కోట్ల అప్పులు: ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 14 , 2026 | 04:20 PM