Share News

బీఆర్ఎస్ హయాంలో రూ.8 లక్షల కోట్ల అప్పులు: ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

ABN , Publish Date - Oct 14 , 2026 | 03:17 PM

బీఆర్ఎస్ తొమ్మిదిన్నరేళ్ల అవినీతిని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో వివరించారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. తొమ్మిది జిల్లాల్లో బీఆర్ఎస్ భూములు, హోటల్స్ అన్నీ బయట పెట్టారన్నారు.

బీఆర్ఎస్ హయాంలో రూ.8 లక్షల కోట్ల అప్పులు: ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
MP Chamala Kiran Kumar Reddy

హైదరాబాద్, అక్టోబర్ 14: బీఆర్ఎస్ తొమ్మిదిన్నరేళ్ల అవినీతిని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో వివరించారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈరోజు (బుధవారం) మీడియాతో మాట్లాడుతూ.. తొమ్మిది జిల్లాల్లో బీఆర్ఎస్ భూములు, హోటల్స్ అన్నీ బయట పెట్టారన్నారు. తమ వాయిస్ టాంపరింగ్ చేసి సోషల్ మీడియాలో బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో రూ.8 లక్షల కోట్ల అప్పులు చేశారని ఆరోపించారు.


ఏనుగు ఎక్కి ప్రగతి భవన్‌కు వెళ్తానని చెప్పిన వ్యక్తి ఇప్పుడు ఫాంహౌస్‌లో బందీ అయ్యారని ఎంపీ విమర్శించారు. ‘నా పేరు మీద అసైన్డ్ భూములు ఉన్నా, 22ఏ జాబితాలో ఉన్నా, ఇల్లీగల్ భూములు ఉన్నా అక్కడికి మీరు వెళ్లండి. అక్కడే అధికారులను పిలిచి రాసి ఇచ్చేస్తా. తెలంగాణ సమాజానికి నన్ను విలన్‌గా చూపించాలని మాజీ ఐపీఎస్ ఆఫీసర్ మాట్లాడారు. అమెరికాలో 6 ఏళ్లు ఉండి ఫైవ్ స్టార్ హోటల్ కట్టుకున్నా అని కేటీఆర్ చెప్పారు. ఇంత తెలివి ఉన్న కేటీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని పాలిస్తే రూ.8 లక్షల కోట్ల అప్పు ఎలా అయింది’ అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఆర్టిస్టుల డ్రామాలు బంద్ చేయాలంటూ ఎంపీ చామల కిరణ్ కుమార్ హితవుపలికారు.


ఇవి కూడా చదవండి...

వివేకా హత్య కేసు.. ఈడీ విచారణకు హాజరైన ఎంపీ అవినాశ్ రెడ్డి

ఏపీ స్థానిక ఎన్నికలు.. సీట్ల సర్దుబాటుపై తుది చర్చల్లో కూటమి నేతలు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 14 , 2026 | 03:20 PM