Share News

జగన్ అక్రమాస్తుల కేసులపై కీలక పరిణామం

ABN , Publish Date - Oct 14 , 2026 | 12:57 PM

మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేసులపై కీలక పరిణామం చోటుచేసుకుంది. సీబీఐ కేసులతో పాటు ఈడీ కేసులను విచారణ జరపాలని సీబీఐ కోర్టు నిర్ణయించింది.

జగన్ అక్రమాస్తుల కేసులపై కీలక పరిణామం
YS Jagan Disproportionate Assets Case

హైదరాబాద్, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) కేసులపై కీలక పరిణామం చోటుచేసుకుంది. సీబీఐ కేసులతో పాటు ఈడీ కేసులను విచారణ జరపాలని సీబీఐ కోర్టు నిర్ణయించింది. జగన్ ఈడీ కేసులను కూడా రోజువారీగా విచారణ జరిపేందుకు న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది. జగన్ సహా 70 మంది నిందితులను వ్యక్తిగతంగా సీబీఐ కోర్టు విచారించనుంది.


జగన్‌పై న్యాయస్థానంలో పదేళ్లుగా 9 ఈడీ ఛార్జిషీట్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ కేసులను రోజువారీగా విచారణ జరపాలని ఇప్పటికే తెలంగాణ హైకోర్టును ఈడీ అధికారులు ఆశ్రయించిన విషయం తెలిసిందే. సీబీఐ కోర్టులో డిశ్చార్జ్ పిటిషన్లు తేలకపోవడంతో విచారణ ముందుకెళ్లట్లేదని ఈడీతో పాటు హరిరామజోగయ్య, మరి కొంతమంది హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్.. డబుల్ డెక్కర్ కారిడార్‌కు ఆమోదం

హాస్టళ్ల టెండర్లలో రూ.66 కోట్ల గుడ్‌విల్?.. రేవంత్ ప్రభుత్వంపై హరీశ్‌రావు సంచలన ఆరోపణలు

హైదరాబాద్‌లో క్రిప్టోకరెన్సీ పేరుతో భారీ దోపిడీ

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Oct 14 , 2026 | 01:13 PM