Share News

కాఫీ పొడి లోడు మాటున ఎర్రచందనం అక్రమ రవాణా.. 8 మంది అరెస్ట్

ABN , Publish Date - Oct 14 , 2026 | 02:14 PM

కడప జిల్లాలో ఎనిమిది మంది అంతర్రాష్ట్ర ఎర్రచందనం స్మగర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి దాదాపు 1.984 టన్నుల బరువున్న 70 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.

కాఫీ పొడి లోడు మాటున ఎర్రచందనం అక్రమ రవాణా.. 8 మంది అరెస్ట్
Kadapa Red Sandalwood

కడప, అక్టోబర్ 14: జిల్లాలో ఎనిమిది మంది అంతర్రాష్ట్ర ఎర్రచందనం స్మగర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి దాదాపు 1.984 టన్నుల బరువున్న 70 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. కాఫీ పొడి ప్యాకెట్ల లోడు మాటున ఎర్రచందనం దుంగలను తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. మూడు వాహనాలతో పాటు, 643 కాఫీ పౌడర్ అట్టపెట్టెలను సీజ్ చేశారు. సీజ్ చేసిన మొత్తం విలువ రూ.1.30 కోట్లు ఉంటుందని అంచనా. అక్రమంగా ఎర్రచందనం దుంగలను తరలిస్తున్నారంటూ సమాచారం అందిన వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. ఎస్.ఏ.కాశినాయన మండలం ఆకుల నారాయణపల్లె సమీపంలో వాహనాలను తనిఖీలు చేశారు. ఈ క్రమంలో కాఫీ పొడి ప్యాకెట్ల లోడుతో వెళ్తున్న వాహనాన్ని తనిఖీ చేయగా పెద్ద ఎత్తున ఎర్రచందనం దుంగలు బయటపడ్డాయి.


ఈ కేసుకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ మీడియాకు తెలియజేశారు. ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారని.. వారిలో తమిళనాడుకు చెందిన ఏడుగురు, ఏపీకి చెందిన ఒకరు ఉన్నారని తెలిపారు. మరికొందరు పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. ఎర్రచందనం అక్రమ రవాణాపై కఠిన చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. పునరావృత నేరస్థులపై అవసరమైతే పీడీ యాక్ట్ అమలు చస్తామన్నారు. కేసును ఛేదించిన పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ అభినందించారు.


ఇవి కూడా చదవండి...

ఎన్‌సీసీ వ్యవస్థాపకుడు ఏవీఎస్ రాజు మృతి.. చంద్రబాబు, లోకేశ్ సంతాపం

వివేకా హత్య కేసు.. ఈడీ విచారణకు హాజరైన ఎంపీ అవినాశ్ రెడ్డి

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 14 , 2026 | 02:15 PM