Share News

రాజ్యాంగ సంస్థలపై దుష్ప్రచారాన్ని ఖండించిన హార్వర్డ్ బృందం

ABN , Publish Date - Oct 14 , 2026 | 01:47 PM

రాజ్యాంగ సంస్థలపై దుష్ప్రచారంపై హార్వర్డ్ ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగ సంస్థలపై జరుగుతున్న దాడిపై హార్వర్డ్ విశ్వవిద్యాలయ విద్యార్థులు, పరిశోధకులు స్పందించారు.

రాజ్యాంగ సంస్థలపై దుష్ప్రచారాన్ని ఖండించిన హార్వర్డ్ బృందం
Harvard University

ఢిల్లీ, అక్టోబర్ 14: రాజ్యాంగ సంస్థలపై దుష్ప్రచారంపై హార్వర్డ్ ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగ సంస్థలపై జరుగుతున్న దాడిపై హార్వర్డ్ విశ్వవిద్యాలయ విద్యార్థులు, పరిశోధకులు స్పందించారు. రాజకీయ ప్రయోజనాల కోసం తగిన అనుమతులు లేకుండా, రాజకీయ లబ్ధి కోసం తమ విశ్వవిద్యాలయ పేరును వాడుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు హార్వర్డ్ లా, మెడికల్, బిజినెస్, కెన్నెడీ స్కూళ్లకు చెందిన భారతీయ విద్యార్థులు ప్రకటన విడుదల చేశారు.


రాజకీయ సౌలభ్యం కోసం కాకుండా, అన్ని వేళలా రాజ్యాంగం, చట్టబద్ధత, పౌర స్వేచ్ఛలను గౌరవించాలని హార్వర్డ్ ప్రతినిధుల బృందం స్పష్టం చేసింది. రాజకీయ ప్రచారాల కోసం హార్వర్డ్ పేరును వాడుకోవడంపై సంతకం చేసిన సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు, ఎన్నికల సంఘం(ఈసీ), పార్లమెంట్ ప్రతిష్ఠను దెబ్బతీసేలా మాట్లాడటం సరికాదని హితవు పలికారు. రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా, ఎల్లప్పుడూ రాజ్యాంగ సూత్రాలకే కట్టుబడి ఉండాలని హార్వర్డ్ ప్రతినిధులు పిలుపునిచ్చారు.


ఇవి కూడా చదవండి...

ఎయిర్ ఇండియా విమానానికి హైజాక్ హెచ్చరిక.. జైపూర్‌లో అత్యవసర ల్యాండింగ్

సీజేపీ నేతలను జైలుకు పంపడం పిరికిపంద చర్య: ఎంపీ రాహుల్ గాంధీ

Read Latest National News And Telugu News

Updated Date - Oct 14 , 2026 | 01:54 PM