Share News

సీజేపీ నేతలను జైలుకు పంపడం పిరికిపంద చర్య: ఎంపీ రాహుల్ గాంధీ

ABN , Publish Date - Oct 14 , 2026 | 12:03 PM

కాక్రోచ్ జనతా పార్టీ నేతలు సౌరవ్ దాస్, అశుతోశ్ రాంకాలను జ్యుడీషియల్ కస్టడీకి పంపడంపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. సీజేపీ నేతలను జైలులో పెట్టడాన్ని పిరికిపంద చర్యగా ఆయన అభివర్ణించారు.

సీజేపీ నేతలను జైలుకు పంపడం పిరికిపంద చర్య: ఎంపీ రాహుల్ గాంధీ
MP Rahul Gandhi

న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నేతలు సౌరవ్ దాస్, అశుతోశ్ రాంకాలను జ్యుడీషియల్ కస్టడీకి పంపడంపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. సీజేపీ నేతలను జైలులో పెట్టడాన్ని పిరికిపంద చర్యగా ఆయన అభివర్ణించారు. జంతర్ మంతర్ వద్ద త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శిస్తూ శాంతియుతంగా నిరసన తెలపడం నేరం కాదని, అలాంటి నిరసనల్లో పాల్గొన్న యువతను జైలులో పెట్టడం ఏంటని ప్రశ్నించారు. విద్యార్థులు, యువత, జర్నలిస్టులు, ఇండి కూటమి నేతలు వేర్వేరు జెండాలు, బ్యానర్లతో కనిపించినప్పటికీ వారి లక్ష్యం మాత్రమే ఒక్కటేనని పేర్కొన్నారు. ఆ పౌరులంతా రాజ్యాంగం కల్పించిన హక్కుల కోసం గళమెత్తుతున్నారని పేర్కొన్నారు. జంతర్ మంతర్ దేశ ప్రజలదేనని, దాన్ని తిరిగి వారి నిరసన వేదికగా మారుస్తామని రాహుల్ స్పష్టం చేశారు.


కాగా, జంతర్ మంతర్ పరిసరాల్లోకి అనుమతి లేకుండా ప్రవేశించారనే ఆరోపణలతో సౌరవ్ దాస్, అశుతోశ్ రాంకాలను ఢిల్లీ పోలీసులు నిన్న అరెస్టు చేశారు. వీరితో పాటు మరో సీజేపీ నేత అజింక్య షిండేను కూడా అదుపులోకి తీసుకున్నారు. అనంతరం బుధవారం ఉదయం నిందితులను మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. విచారణ సందర్భంగా వారంతా ప్రజాశాంతికి భంగం కలిగించారని పోలీసులు ఆరోపించగా.. సౌరవ్ దాస్, అశుతోశ్ రాంకాలకు ఐదు రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో వారిని తీహార్ జైలుకు తరలించారు. మరోవైపు, అజింక్య షిండేకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.5 వేల పూచీకత్తుతో పాటు ఏడాది పాటు ప్రజాశాంతికి భంగం కలిగించే కార్యకలాపాల్లో పాల్గొనకూడదనే షరతు విధించింది. కాగా, వీరంతా ఓటు చోరీ, ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను నిరసిస్తూ భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

సీజేపీకి షాక్.. సౌరవ్ దాస్, అశుతోశ్ రాంకాలకు జ్యుడీషియల్ కస్టడీ..

భారీ అగ్నిప్రమాదం.. ఒకరి మృతి, 15 మందిని కాపాడిన ఫైర్ సిబ్బంది

Updated Date - Oct 14 , 2026 | 12:37 PM