Share News

జీఓ 59 పెండింగ్ దరఖాస్తులకు నెల రోజుల్లో పరిష్కారం: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

ABN , Publish Date - Oct 09 , 2026 | 03:55 PM

22A సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీల అమలులో మరో కీలక ముందడుగు పడిందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

జీఓ 59 పెండింగ్ దరఖాస్తులకు నెల రోజుల్లో పరిష్కారం: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
Ponguleti Srinivas Reddy

హైదరాబాద్, అక్టోబర్ 9: 22A సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీల అమలులో మరో కీలక ముందడుగు పడిందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈరోజు(శుక్రవారం) మీడియాతో మాట్లాడుతూ.. 22ఎ సమస్యల పరిష్కారానికి ఇప్పటివరకు ఏడు కీలక ఉత్తర్వులు ఇచ్చినట్లు చెప్పారు. తాజాగా జీఓ 59 దరఖాస్తుదారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పిందన్నారు. 500 చదరపు గజాలలోపు జీఓ 59 పెండింగ్ దరఖాస్తులకు నెల రోజుల్లో పరిష్కరిస్తామని వెల్లడించారు. ఈ మేరకు కలెక్టర్లకు ప్రభుత్వం కీలక ఆదేశాలు ఇస్తూ.. మెమో నెం.48030 జారీ చేసినట్లు తెలిపారు.


జీఓ 59 అమలులో అక్రమాలకు తావులేదని.. నిబంధనల ప్రకారమే నిర్ణయాలు ఉంటాయని మంత్రి స్పష్టం చేశారు. గతంలో జీఓ 59 అమలులో జరిగిన అక్రమాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే జారీ చేసిన కన్వేయన్స్ డీడ్స్ కేసులను కూడా సమగ్రంగా పరిశీలించాలన్నారు. 22-ఎపై శరవేగంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. సీఎం హామీ ఇచ్చిన 24 గంటల్లోనే 22-ఎ సమస్యలపై ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేశామన్నారు. 22-ఎకు సంబంధించిన 10-12 సమస్యలను ఫాస్ట్‌ట్రాక్‌లో ప్రభుత్వం పరిష్కరిస్తోందని తెలిపారు. జీఓ118, జీఓ 76లకు అనుగుణంగా స్పష్టమైన మెమోలు జారీ చేసినట్లు చెప్పారు.


22-ఎలో ఉన్నా GHMC, HMDA, DTCP, మున్సిపల్ అనుమతులున్న ఇళ్లు, ప్లాట్లు, ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లకు అనుమతిస్తామని మంత్రి తెలిపారు. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న అర్బన్ ల్యాండ్ సీలింగ్ దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. నాలా ప్రక్రియ పూర్తికాని పట్టా భూముల రిజిస్ట్రేషన్లకు పరిష్కారం చూపుతామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి: కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి

SIRపై బీఆర్‌ఎస్ మౌనం.. బీజేపీతో లోపాయికారి ఒప్పందమంటూ మహేశ్ ఫైర్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 09 , 2026 | 04:40 PM