తెలంగాణలో 95 లక్షల ఓట్ల తొలగింపు వార్త అవాస్తవం: ఎన్నికల ప్రధానాధికారి
ABN , Publish Date - Oct 09 , 2026 | 03:21 PM
తెలంగాణలో 95 లక్షల ఓట్లు తొలగింపు వార్త అవాస్తవమని ఎస్‌ఈసీ తెలిపారు. 95 లక్షల ఓట్లను తొలగించారంటూ వచ్చిన వార్తపై తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి వివరణ ఇచ్చారు. ఓటర్ల జాబితా సవరణపై తప్పుడు ప్రచారం జరుగుతోందని స్పష్టం చేశారు.
హైదరాబాద్, అక్టోబర్ 9: తెలంగాణలో 95 లక్షల ఓట్లు తొలగింపు వార్త అవాస్తవమని ఎస్‌ఈసీ తెలిపారు. 95 లక్షల ఓట్లను తొలగించారంటూ వచ్చిన వార్తపై తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి వివరణ ఇచ్చారు. ఓటర్ల జాబితా సవరణపై తప్పుడు ప్రచారం జరుగుతోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 73,39,235 మంది ఓటర్లను మాత్రమే ఏఎస్‌డీడీ (ASDD) కేటగిరీలో గుర్తించినట్లు వెల్లడించారు. ఇప్పటివరకు 92,88,187 నోటీసులు జారీ చేశామని చెప్పారు. 92,23,486 మంది ఓటర్లకు నోటీసులు అందగా.. ఇంకా 64,701 నోటీసులను పంపిణీ చేయాల్సి ఉందన్నారు.
ఇప్పటివరకు నోటీసులు అందుకున్న వారిని 82,11,205 మంది విచారణలు పూర్తి అయినట్లు ఎస్‌ఈసీ తెలిపారు. తుది ఓటర్ల జాబితాలో చోటు కల్పించేందుకు 74,62,851 మందిని అర్హులుగా గుర్తించామని.. అనర్హులుగా గుర్తించిన ఓటర్లు 12,969 మంది మాత్రమే అని తెలిపారు. మరో 18,12,367 మంది ఓటర్లపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. 2026, నవంబర్ 5 లోపు మిగిలిన నోటీసులపై నిర్ణయాలు తీసుకుంటామని వెల్లడించారు. ఓటర్ల జాబితాపై వచ్చిన వార్త వాస్తవాలకు దూరంగా ఉందన్న తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి: కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి
SIRపై బీఆర్‌ఎస్ మౌనం.. బీజేపీతో లోపాయికారి ఒప్పందమంటూ మహేశ్ ఫైర్
Read Latest Telangana News And Telugu News