Share News

తెలంగాణలో వచ్చే ఏడాది నుంచే 10+2 విధానం.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

ABN , Publish Date - Nov 11 , 2026 | 04:12 PM

విద్యాశాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి తెలంగాణలో 10+2 విధానం అమలుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. తెలంగాణ విద్యావిధానంలో సంస్కరణలు తీసుకురావాలని నిర్ణయించామని సీఎం తెలిపారు.

తెలంగాణలో వచ్చే ఏడాది నుంచే 10+2 విధానం.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
CM Revanth Reddy

హైదరాబాద్, నవంబర్ 11: తెలంగాణలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి 10+2 విధానం అమలుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈరోజు (బుధవారం) విద్యాశాఖపై సీఎం సమీక్ష నిర్వహించారు. తెలంగాణ విద్యావిధానంలో సంస్కరణలు తీసుకురావాలని నిర్ణయించామని.. ఆధునిక అవసరాలకు అనుగుణంగా విద్యా విధానంలో మార్పులు తీసుకురావాల్సిందే అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ మొదటి ప్రాధాన్యమని చెప్పుకొచ్చారు.


ఏ ఒక్క విద్యార్థికి నష్టం జరగకుండా ఉండాలన్నదే ప్రభుత్వ ఆలోచన అని సీఎం అన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి 10+2 విధానం అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు విద్యకు ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. 12వ తరగతి నుంచి నైపుణ్యంపై దృష్టి సారిస్తున్నట్లు వెల్లడించారు. 9 నుంచి 12వ తరగతి వరకు ఉన్నత విద్యగా పరిగణించి ప్రత్యేక విద్యను (Specialised Education) అందించాలని ఆదేశించారు.


తెలంగాణ విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావాల్సిందే అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఇందుకు అవసరమైన మౌలిక వసతులను కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాలన్నదే ప్రభుత్వ సంకల్పమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సమావేశానికి ప్రభుత్వ సలహాదారులు కే.కేశవరావు, సుదర్శన్ రెడ్డి, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.


ఇవి కూడా చదవండి...

CityofLakesగా హైదరాబాద్‌‌కు పూర్వవైభవం.. ఇదే నా సంకల్పం: సీఎం రేవంత్

పుట్టిన ప్రతి బిడ్డకు నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యం: భట్టి విక్రమార్క

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 11 , 2026 | 04:35 PM