Share News

CityofLakesగా హైదరాబాద్‌‌కు పూర్వవైభవం.. ఇదే నా సంకల్పం: సీఎం రేవంత్

ABN , Publish Date - Nov 11 , 2026 | 03:23 PM

హైదరాబాద్ మాదాపూర్‌లోని చరిత్రాత్మక తమ్మిడికుంట చెరువు కొత్త శోభను సంతరించుకుంది. పునరుద్ధరణ పనులను పూర్తి చేసుకున్న ఈ చెరువు ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభంకానుంది.

CityofLakesగా హైదరాబాద్‌‌కు పూర్వవైభవం.. ఇదే నా సంకల్పం: సీఎం రేవంత్
CM Revanth Reddy

హైదరాబాద్, నవంబర్ 11: మాదాపూర్‌లోని చరిత్రాత్మక తమ్మిడికుంట చెరువు కొత్త శోభను సంతరించుకుంది. పునరుద్ధరణ పనులను పూర్తి చేసుకున్న ఈ చెరువు ఈరోజు (బుధవారం) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభంకానుంది. తమ్మిడికుంట చెరువు ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్‌ వేదికగా ఆసక్తికర పోస్ట్ చేశారు. సిటీ ఆఫ్ లేక్స్‌గా హైదరాబాద్‌కు పూర్వవైభవం తీసుకురావడమే సంకల్పమని స్పష్టం చేశారు. భావితరాలకు ఉపయోగపడేలా తమ్మిడికుంట చెరువును అభివృద్ధి చేసినట్లు సీఎం తెలిపారు.


రేవంత్ పోస్ట్..

‘ప్రజల సమక్షంలో నేడు తమ్మిడికుంట చెరువు ప్రారంభోత్సవం. #CityofLakes గా హైదరాబాద్‌కు పూర్వవైభవం తీసుకురావడమే నా సంకల్పం. భావితరాలకు ఉపయోగపడేలా, హైడ్రా ఆధ్వర్యంలో 30 ఎకరాల్లో తమ్మిడికుంట చెరువును అద్భుతంగా అభివృద్ధి చేసి, నేడు ప్రజలకు అంకితం చేయనున్నాం. ప్రజా ప్రభుత్వం ఇప్పటివరకు కూకట్‌పల్లి నల్లచెరువు, బతుకమ్మకుంట, బమ్-రుక్న్-ఉద్-దౌలా చెరువులను అభివృద్ధి చేసి ప్రారంభించగా, తమ్మిడికుంట నాలుగో చెరువుగా నిలవనుంది. అతి కొద్ది రోజుల్లోనే పునరుద్ధరణ పనులు పూర్తికానున్న మరిన్ని చెరువులను కూడా ప్రారంభిస్తాం’ అంటూ ఎక్స్‌లో రేవంత్ రెడ్డి పోస్ట్ చేశారు.


ఒకప్పుడు ఆక్రమణలు, చెత్తాచెదారంతో నిండిపోయి తమ్మడికుంట చెరువు పునరుద్ధరణ బాధ్యతలను హైడ్రా చేపట్టింది. చెరువులోని వ్యర్థాలను తొలగించడంతో పాటు లోతును కూడా పెంచారు. చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్, చిన్నారులకు కోసం ప్లే ఏరియా, ల్యాండ్ స్కేపింగ్ వంటివి ఏర్పాటు చేశారు. చెరువు అభివృద్ధికి ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున తన వంతు సహాయం అందించిన విషయం తెలిసిందే. కొత్త కళను సంతరించుకున్న తమ్మిడికుంట చెరువును ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనుండగా.. అక్కినేని నాగార్జున గౌరవ అతిథిగా హాజరుకానున్నారు.


ఇవి కూడా చదవండి...

‘డబ్బులకు ఆశపడకుండా ఓటేయండి’.. గ్రాడ్యుయేట్లకు కవిత పిలుపు

సీఐఐ సదస్సుతో ఏపీ అభివృద్ధికి కొత్త అవకాశాలు: సీఎం చంద్రబాబు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 11 , 2026 | 03:29 PM