Share News

‘డబ్బులకు ఆశపడకుండా ఓటేయండి’.. గ్రాడ్యుయేట్లకు కవిత పిలుపు

ABN , Publish Date - Nov 11 , 2026 | 11:59 AM

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఎన్ని పోరాటాలు చేసినా మార్పు రావడం లేదని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శలు గుప్పించారు. ఓటు ద్వారా ఇచ్చే తీర్పుతోనే మార్పు సాధ్యమన్నారు.

‘డబ్బులకు ఆశపడకుండా ఓటేయండి’.. గ్రాడ్యుయేట్లకు కవిత పిలుపు
Kavitha

హైదరాబాద్, నవంబర్ 11: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఎన్ని పోరాటాలు చేసినా మార్పు రావడం లేదని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శలు గుప్పించారు. ఈరోజు(బుధవారం) మీడియాతో మాట్లాడుతూ.. ఓటు ద్వారా ఇచ్చే తీర్పుతోనే మార్పు సాధ్యమన్నారు. త్వరలో రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయని తెలిపారు. 4 కోట్ల మందిలో 80 లక్షల మంది గ్రాడ్యుయేట్లు ఉన్నారని చెప్పారు. అయితే 80 లక్షల్లో 10 లక్షల మంది కూడా నమోదు చేసుకోలేదన్నారు.


ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని కవిత కోరారు. వారి ఓటుతో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు బుద్ధి చెప్పే అవకాశం ఉందన్నారు. దేశ వ్యాప్తంగా 8 మంది యువ ఎంపీలు ఉంటే ఒక్కరే పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ లేనివారు ఉన్నారని చెప్పారు. తెలంగాణ ప్రజలు తమకు మద్దతు ఇవ్వాలని కోరారు. కాంగ్రెస్ రూ.200 కోట్లు ఖర్చు చేసి ఈ ఎన్నికల్లో గెలవాలని చూస్తోందని ఆరోపించారు. యువత డబ్బులకు అమ్ముడు పోకుండా ఓట్లు వేయాలని సూచించారు.


77 నియోజకవర్గాల్లో ఈ ఎన్నికలు జరుగుతున్నాయని.. నేటి నుంచి అధికారికంగా ప్రచారాన్ని ప్రారంభించినట్లు కవిత వెల్లడించారు. టీఆర్‌ఎస్ అభ్యర్థులకు వీర తిలకం దిద్ది యుద్ధరంగంలో దింపుతున్నామని చెప్పారు. కలిసి వచ్చే పార్టీలతో ఎన్నికల్లో ముందుకు వెళ్తామని వెల్లడించారు. టీఆర్‌ఎస్‌ పార్టీకి ఎన్నికల సంఘం అధికారిక గుర్తింపు ఉందన్నారు. కొన్ని అభ్యంతరాలు వచ్చాయని.. వాటికి సంబంధించిన సమస్యలు త్వరలో పరిష్కారమవుతాయని కవిత పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

హనుమకొండలో మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ హౌస్ అరెస్ట్

తెలంగాణలో రెండోసారి ‘భారత్ సమ్మిట్’.. ప్రపంచ పరిస్థితులపై చర్చలు: సల్మాన్ ఖుర్షీద్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 11 , 2026 | 12:03 PM