Share News

తెలంగాణలో రెండోసారి ‘భారత్ సమ్మిట్’.. ప్రపంచ పరిస్థితులపై చర్చలు: సల్మాన్ ఖుర్షీద్

ABN , Publish Date - Nov 11 , 2026 | 11:06 AM

తెలంగాణలో రెండోసారి ‘భారత్ సమ్మిట్’ జరుగుతోందని కేంద్రమాజీ మంత్రి, కాంగ్రెస్‌ విదేశీ వ్యవహారాల విభాగం చైర్మన్‌ సల్మాన్ ఖుర్షీద్ తెలిపారు.

తెలంగాణలో రెండోసారి ‘భారత్ సమ్మిట్’.. ప్రపంచ పరిస్థితులపై చర్చలు: సల్మాన్ ఖుర్షీద్
Bharat Summit Hyderabad

హైదరాబాద్, నవంబర్ 11: తెలంగాణలో రెండోసారి ‘భారత్ సమ్మిట్’ జరుగుతోందని కేంద్రమాజీ మంత్రి, కాంగ్రెస్‌ విదేశీ వ్యవహారాల విభాగం చైర్మన్‌ సల్మాన్ ఖుర్షీద్ తెలిపారు. ఈరోజు(బుధవారం) హెచ్‌ఐసీసీలో మీడియాతో మాట్లాడుతూ.. భారత్ సమ్మిట్ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. ప్రపంచంలో ఉన్న పరిస్థితులపై సమ్మిట్‌లో చర్చించనున్నట్లు చెప్పారు. దేశాల మధ్య కోఆర్డినేషన్ కోసం సమ్మిట్ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. గాంధీ సిద్ధాంతాలు ఈ దేశానికి అవసరమన్నారు. ప్రపంచ వ్యాప్తంగా మానవత్వం పెంపొందేలా భారత్‌ సమ్మిట్ కొనసాగుతుందని వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రోగ్రెసివ్ భావాలున్న వారిని సదస్సుకు ఆహ్వానించామని సల్మాన్ ఖుర్షీద్ పేర్కొన్నారు.


కాంగ్రెస్ ఐడియాలజీ ప్రపంచానికి దిక్సూచి: భట్టి

‘భారత్ సమ్మిట్‌’కు 70 దేశాల నుంచి 1000 మంది ప్రతినిధులు వస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సమ్మిట్‌కు వస్తున్న ప్రతినిధులకు స్వాగతం తెలిపారు. భారత్ సమ్మిట్‌ను తెలంగాణలో జరపడం గౌరవంగా ఉందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా విభజన రాజకీయాలు, విద్వేష రాజకీయాలు కొనసాగుతున్నాయని తెలిపారు. తాము గాంధీ పాటించిన అహింస సిద్ధాంతాన్ని పాటిస్తున్నామని చెప్పారు. నెహ్రూ ప్రతిపాదించిన అలీన విధానం ఎంతగానో ఉపయోగపడిందని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ ఐడియాలజీ ప్రపంచానికి దిక్సూచిగా పనిచేస్తుందని వెల్లడించారు. రాజకీయ, సామాజిక, ఆర్థిక అంశాల చర్చకు భారత్ సమ్మిట్ ఉపయోగపడుతుందని భట్టి విక్రమార్క తెలిపారు.


అదే కాంగ్రెస్ తపన: మంత్రి శ్రీధర్ బాబు

బీజేపీ ఆలోచన వేరని.. ప్రగతిశీల ఆలోచనలు ఉన్న కాంగ్రెస్ ఆలోచన వేరని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. మోదీ తర్వాత ఎవరిని లాంచ్ చేద్దామని బీజేపీ ఆలోచిస్తోందన్నారు. ప్రపంచంలో ఉన్న సమస్యలకు పరిష్కారం చూపడమే కాంగ్రెస్ తపనగా చెప్పుకొచ్చారు. భారత్ సమ్మిట్ ఒక ఎకనామిక్ సమ్మిట్‌లాగా ఉపయోగపడుతుందన్నారు. ఈ సమ్మిట్ రాజకీయాల కోసం కాదని అన్నారు. బీజేపీ అనవసర విమర్శలు మానుకోవాలని హితవుపలికారు. భారత్ సమ్మిట్‌కు రాహుల్‌ గాంధీని ఆహ్వానిస్తే తప్పేంటని నిలదీశారు. టెక్నాలజీ, ప్రస్తుత సవాళ్లపై ఎవరైనా మాట్లాడొచ్చన్నారు. ప్రగతిశీల భావాలున్న ప్రతిపార్టీని సమ్మిట్‌కు ఆహ్వానించామని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా మారుతున్న పరిస్థితులపై చర్చిస్తామన్నారు. అలాగే జెన్‌జీ డిమాండ్లపై కూడా ఒక సెషన్‌లో చర్చించనున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.


ప్రజాస్వామ్యంపై నమ్మకున్న వాళ్లు పాల్గొంటారు: మహేశ్

విదేశాల నుంచి భారత్ సమ్మిట్‌కు వస్తున్నారని తెలంగాణ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ సదస్సులో పాల్గొంటారని చెప్పారు. ప్రపంచంలో జరుగుతున్న అంశాలపై చర్చించనున్నట్లు తెలిపారు. ప్రజాస్వామ్యంపై నమ్మకున్న వాళ్లు భారత్ సమ్మిట్‌లో పాల్గొంటారని మహేశ్ కుమార్ వెల్లడించారు.


ఇవి కూడా చదవండి...

స్వచ్ఛ సర్వేక్షణ్‌లో సత్తా చాటిన ఏపీ.. మంత్రి నారాయణకు అవార్డులను అందించనున్న రాష్ట్రపతి ముర్ము

హనుమకొండలో మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ హౌస్ అరెస్ట్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 11 , 2026 | 11:22 AM