Share News

దేశ విద్యారంగ అభివృద్ధికి మౌలానా ఆజాద్ సేవలు చిరస్మరణీయం: సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Nov 11 , 2026 | 08:58 AM

భారతదేశపు మొదటి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి నేడు. ఈ సందర్భంగా ఆయన సేవలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సర్మించుకున్నారు.

దేశ విద్యారంగ అభివృద్ధికి మౌలానా ఆజాద్ సేవలు చిరస్మరణీయం: సీఎం చంద్రబాబు
AP CM Chandrababu Naidu

అమరావతి, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): భారతదేశపు మొదటి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి నేడు. ఈ సందర్భంగా ఆయన సేవలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) సర్మించుకున్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబు పోస్టు పెట్టారు.


ఆజాద్ ఆదర్శాలు భవిష్యత్ తరాలకు స్ఫూర్తి

‘స్వాతంత్య్ర సమరయోధుడు, గొప్ప పండితుడు, దేశ విద్యావ్యవస్థను అభివృద్ధి చేయడానికి అవిశ్రాంతంగా కృషి చేసిన భారతదేశపు మొదటి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ సేవలు ఎల్లకాలం గుర్తుండిపోతాయి. ఆయన జీవితం, ఆదర్శాలు భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయి. ఆయన జయంతి సందర్భంగా ఈ మహనీయునికి నేను నివాళులర్పిస్తున్నాను’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

అటవీ అమరవీరుల త్యాగం మరువలేనిది: పవన్ కల్యాణ్

ఏపీ క్యాబినెట్ కీలక భేటీ.. 30కు పైగా అజెండా అంశాలపై సీఎం చర్చ

జగన్.. వైఎస్సార్ పేరు చెడగొడుతున్నారు.. జేసీ ప్రభాకర్ రెడ్డి ధ్వజం

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Nov 11 , 2026 | 09:15 AM