నెల్లూరులో భూముల స్కాం.. మేకపాటి రాజగోపాల్‌పై కేసు నమోదు
ABN , Publish Date - Nov 11 , 2026 | 11:40 AM
నెల్లూరు జిల్లాలో దాదాపు రూ.147.79 కోట్లు విలువ చేసే భారీ భూముల స్కాం వెలుగులోకి వచ్చింది. నకిలీ పత్రాలు, సంతకాలతో తమ భూములను రిజిస్ట్రేషన్ చేయించుకున్నారంటూ వైసీపీ నేత మేకపాటి రాజగోపాల్ రెడ్డిపై సొంత మేనల్లుడు ఫిర్యాదు చేశారు.
నెల్లూరు, నవంబర్ 11: జిల్లాలో దాదాపు రూ.147.79 కోట్లు విలువ చేసే భారీ భూముల స్కాం వెలుగులోకి వచ్చింది. నకిలీ పత్రాలు, సంతకాలతో తమ భూములను రిజిస్ట్రేషన్ చేయించుకున్నారంటూ వైసీపీ నేత మేకపాటి రాజగోపాల్ రెడ్డిపై.. ఆయన సొంత మేనల్లుడు పోలీసులకు ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది.
దాదాపు రూ. రూ.147.79కోట్లు విలువైన భూములను నకిలీ పత్రాలు, నకిలీ వ్యక్తుల ఫొటోలు, సంతకాలు, వేలిముద్రలతో మార్టిగేజ్ రిజిస్ట్రేషన్ చేశారంటూ రాజగోపాల్ రెడ్డి సొంత మేనల్లుడు బిజివేముల సురేంద్రనాథ రెడ్డి ఆరోపించారు. ఈ వ్యవహారంపై గత నెల 30న పొదలకూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సురేంద్రనాథ రెడ్డి ఫిర్యాదు మేరకు IPC 419, 420, 467, 468, 471, 120(B) r/w 34 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
వైసీపీ నేత మేకపాటి రాజగోపాల్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు శ్రీదేవి, అభిషేక్ రెడ్డి, అభినవ్ రెడ్డి, ఆయన బావ పాపకన్ను ప్రభాకర్ రెడ్డి, మరికొందరిపై కేసు నమోదు అయ్యింది. అంతేకాకుండా.. నెల్లూరులోని ఇండియన్ బ్యాంక్ అధికారుల పాత్రపైనా విచారణ జరపాలని సురేంద్రనాథ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి...
హనుమకొండలో మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ హౌస్ అరెస్ట్
తెలంగాణలో రెండోసారి ‘భారత్ సమ్మిట్’.. ప్రపంచ పరిస్థితులపై చర్చలు: సల్మాన్ ఖుర్షీద్
Read Latest Telangana News And Telugu News