పుట్టిన ప్రతి బిడ్డకు నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యం: భట్టి విక్రమార్క
ABN , Publish Date - Nov 11 , 2026 | 03:55 PM
తెలంగాణ బిడ్డలు ప్రపంచాన్ని శాసించేలా విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
హనుమకొండ, నవంబర్ 11: తెలంగాణ బిడ్డలు ప్రపంచాన్ని శాసించేలా విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఈరోజు (బుధవారం) కాజీపేటలో పర్యటించిన డిప్యూటీ సీఎం.. తెలంగాణ పబ్లిక్ స్కూల్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
27 లక్షల మంది విద్యార్థులకు ఏకకాలంలో బ్రేక్‌ఫాస్ట్ అందించే కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని ఉపముఖ్యమంత్రి అన్నారు. ఇది దేశంలోనే కాదు, ప్రపంచంలోనే ప్రత్యేకమని చెప్పుకొచ్చారు. తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డకు నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.
కాజీపేట పర్యటనలో భాగంగా డిప్యూటీ సీఎం భట్టికి మడికొండలో స్థానిక కాంగ్రెస్ నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం తెలంగాణ పబ్లిక్ స్కూల్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కాసేపట్లో హనుమకొండ పరిధిలోని నక్కలగుట్టలో మైరా(MYRAA) హాస్పిటల్‌ను ప్రారంభించనున్నారు. ఆపై వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి నివాసంలో వరంగల్ ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలతో భట్టి విక్రమార్క సమావేశం కానున్నారు.
ఇవి కూడా చదవండి...
సీఐఐ సదస్సుతో ఏపీ అభివృద్ధికి కొత్త అవకాశాలు: సీఎం చంద్రబాబు
CityofLakesగా హైదరాబాద్‌కు పూర్వవైభవం.. ఇదే నా సంకల్పం: సీఎం రేవంత్
Read Latest Telangana News And Telugu News